Home News Stories

ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న చంద్రబాబు నివేదిక…

తెలంగాణ లో ఎన్నికల ఫీవర్ స్టార్టవ్వడంతో ఆ ఎఫెక్ట్ అమరావతి పై కుడా పడింది. చంద్రబాబు కుడా ఎన్నికలమూడ్ లోకి వెళ్ళీ వైఫల్యాలపై ప్రత్యేక నివేదికలు ఇస్తానంటూఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతున్నారు. కేసీఆర్ మాదిరిగా తాను ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తానంటూ నేతలకు క్లియర్ ఇండి కేషన్స్ ఇస్తున్నారు టీడీపీ అధినేత….

ఎమ్మెల్యేల నడవడికకు సంబంధించిన వైఫల్యాలపై నివేదికలు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వాటిని త్వరలో చేతికి ఇస్తానని, లోపాలను సవరించుకుంటారో, లేదో మీ ఇష్టం అంటూ వారిని హెచ్చరించారు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని శాసన సభ్యులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరు, ఆయా పథకాల విషయంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? అని ఆయన తొలుత ఎమ్మెల్యేలను అడిగారు. శాసనసభ్యు లు ముక్తకంఠంతో చాలా సానుకూల స్పందన ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే మీరందరూ గెలవాలి కదా! కొన్ని చోట్ల కొంత మంది గెలుపుపై ఎందుకు అనుమనాలొస్తున్నాయి? అని ఆయన ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దానికి ఆయనే సమాధానం చెప్తూ మీ పని తీరు, నడవడికలో లోపం వలనే అ లాంటి అనుమానాలు వస్తున్నాయని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది.

శాసనసభ్యుల పనితీరు, నడవడికపై నియోజకవర్గాల వారీ ప్రత్యేక సమావేశాన్ని సేకరించినట్లు తెలిపారు. అందుకు సంబంధించి నివేదికలు కూడా సిద్ధమయ్యాయని, త్వరలో ఎవరివి వారికి ఇస్తానని తెలిపారు. ఎన్నికల సమయం ఆ సన్నమవుతున్న సమయంలో ఆ నివేదికల్లో ఉన్న లోపాలను వెంటనే సవరించుకోకపోతే తానేమీ చేయలే నంటూ హెచ్చరించారు.

ఇక‌, అసెంబ్లీలో ఎమ్మెల్యేల పనితీరుపై బాబు తీవ్రంగా సంతృప్తి వ్యక్తం చేశారు. మొ త్తం 125 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మాత్రమే అన్ని రోజులూ హాజరయ్యారని పెద‌వి విరిచారు. 10 మంది కేవలం 4 రోజులు రాగా, 19 మంది 5 రోజులు వచ్చారని చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఒక్క రోజే అసెంబ్లీకి హాజ‌రై.. ఆ త‌ర్వాత ఆయ‌న క‌నిపించ‌కపోవ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్సీల హాజరు వివరాలు ఇవ్వక పోవడం పై విప్‌లను మందలించారు.

అటు అభివద్ధి పనులతోపాటు, ఇటు సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అ మలు చేస్తున్నప్పటికీ కొంత మంది వాటిని ప్రజలకు వివరించలేకపోతున్నారని కూడా సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందుకోసమే గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. ఆ కార్యక్రమాన్ని బాగా చేస్తున్న వారిని అభినందిస్తూనే మిగిలిన వారు వెంటనే దాని నిర్వహణపై దృష్టి పెట్టాలని లేని పక్షంలో ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద టీడీపీ బాస్ ఎన్నికల మూడ్ లోకి వెళ్ళీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here