Home News

ఎస్పీ vs మహిళ మంత్రి..సినిమా జగన్ వరకు వెళ్లిందా…!

మంత్రుల వద్దకు సమస్యలతో పాటు ఫైరవీలు రావడం కామన్..ఇక్కడే ఓ విషయంలో మంత్రికి ఎస్పీకి మధ్య అగ్గి రాజుకుంది. సమస్య పైవరకు వెళ్లే సమయంలో మరో మంత్రి ఎంట్రీ ఇవ్వడంతో సీన్‌ మారింది..సీఎం వద్దకు మ్యాటర్ వెళ్లకుండా మేనేజ్‌ చేద్దామనుకునేలోగా విషయం మొత్తం బయటికొచ్చింది. తానేటి వనిత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఓ విషయంలో మంత్రి వనిత ఇచ్చిన ఆదేశాలకు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ ససేమిరా అన్నారట. నిబంధనలకు విరుద్ధంగా వెళ్లేది లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. దీంతో మంత్రిగారి ఇగో హర్ట్‌ అయినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి మంత్రికి.. జిల్లా ఎస్పీకి మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తుంది.

తానేటి వనిత మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారామె. ఇదే జిల్లా నుంచి ఆళ్ల నాని.. చెరుకువాడ శ్రీరంగనాథరాజులు కూడా మంత్రివర్గంలో ఉన్నా.. వనిత వర్కింగ్‌ స్టయిల్ వేరన్నది వైసీపీ వర్గాల్లో వినిపించే టాక్‌. తెలిసి చేస్తారో లేక తెలియక చేస్తారో కానీ.. ఆమె కొన్నిసార్లు చిక్కుల్లో పడతారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. అలా మొదలైన ఓ సమస్య ఇటీవల అధికారపార్టీలోనూ.. అధికారవర్గాల్లోనూ హీట్ రాజేసిందట. దానిపైనే ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ఇంతలో మంత్రి వైఖరి సరిగా లేదని జిల్లాలోని పోలీస్‌ వర్గాలు నిరసన తెలియజేశాయట. ఎస్పీ నాయక్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. చివరకు తాడేపల్లి వెళ్లి.. నేరుగా సీఎంను కలిసి మంత్రిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారట ఎస్పీ నాయక్‌.

ఈ గొడవ గురించి తెలిసిన వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి పేర్ని నాని సడెన్‌ ఎంట్రీ ఇచ్చారట. సమస్యను అలాగే వదిలేస్తే వ్యవహారం కాస్త రచ్చ రచ్చ అవుతుందని భావించిన ఆయన ఎస్పీకి స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇష్యూని సీఎం వరకు తీసుకెళ్లొద్దని తనదైన స్టయిల్లో చెప్పారట. మంత్రి పేర్నినాని మాట్లాడిన తర్వాత ఎస్పీ కాస్త మెత్తబడినట్టు సమాచారం. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళనకు సమయం దగ్గర పడుతున్నవేళ మంత్రులపై నెగిటివ్‌ రిపోర్ట్స్‌ సీఎ‌ం వద్దకు వెళ్లడం ఏ పరిణామాలకో దారి తీస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here