Home News

లైంగికంగా వేధించిన ఉద్యోగికి మినిస్టర్ సపోర్ట్…!

సాటి ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు … ఆమె కాదనే సరికి లేనిపోని సంబంధం అంటగట్టి ఫిర్యాదు చేయించాడు.. ఆ ఫిర్యాదు చేస్తున్నప్పుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేసి ఆమెను బదనాం చేయడానికి ప్రయత్నించాడు .. విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆ ప్రబుద్దుడ్ని ఉళ్లోకి రానీయకుండా బహిష్కరించారు.. ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడానికి సిద్దమయ్యారు .. అయితే ఒక ఎమ్మెల్యేతో పాటు ఏకంగా మంత్రే రంగంలోకి దిగి అతనిపై సస్పెన్షన్‌ వేటు పడకుండా అడ్డంపడుతున్నారంట.. అతనికి కొమ్ముకాస్తున్న అమాత్యుడి వ్యవహారశైలీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది….

కర్నూల్ జిల్లా గొనెగండ్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి గా పనిచేస్తున్న రంగస్వామి అదే స్కూల్ లో పనిచేస్తున్న మహిళా టీచర్‌ను లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు … అమెను ఎంత వేధించినా మాట వినకపోవడంతో ఆమెను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రచేశాడు.. ఆ మహిళా టీచర్ పై కక్ష తీర్చుకునేందుకు మరో టీచర్ తో అక్రమ సంబంధం అంటగట్టి … క్లాస్ రూమ్ లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థులతో తప్పుడు ఫిర్యాదు చేయించాడు… విద్యార్థులు ఎంఇఒకు ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలను తన సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు…

ఈ ఫిర్యాదుపై ఆరా తీస్తే హెడ్ మాస్టర్ రంగస్వామి ఫిర్యాదు చేయమంటేనే చేశామని విద్యార్థులు చెప్తున్నారు … ఈ వ్యవహారం తెలిసిన పిలిగుండ్ల గ్రామస్తులు గ్రామంలోకి అడుగుపెడితే ఊరుకునేది లేదని రంగస్వామికి వార్నింగ్‌ ఇచ్చారు . విచారణ నివేదిక ఆధారంగా హెచ్ఎం రంగస్వామిని సస్పెండ్ చేస్తున్నట్టు డిఈఓ ప్రకటించారు… అయితే ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డమేకాకుండా .. లొంగలేదన్న కసితో మరో టీచర్ తో అక్రమ సంబంధం అంటగట్టిన హెచ్ఎంను కాపాడేందుకు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి రంగంలోకి దిగారంట… హెచ్ఎం రంగస్వామిని సస్పెండ్ చేయకుండా వారు డిఈఓపై ఒత్తిడి తెచ్చారు… ఆ హెచ్ఎంను గ్రామంలోకి అడుగుపెట్టేందుకు స్థానికులు నిరాకరించడంతో గోనెగండ్ల మండలం అల్వాలకు డెప్యుటేషన్ పై పంపడం కలకలం రేపుతోందిప్పుడు..

మంత్రి, ఎమ్మెల్యేల ఒత్తిడితో అర్హత లేని పోస్టుకు ఆయన్ని పంపారంట.. ఎస్జీటి లు అర్హులయ్యే పోస్టులో నిబంధనలకు విరుద్ధంగా LSL అర్హత ఉన్న రంగస్వామిని అక్కడికి డిప్యుటేషన్ పై పంపడం టీచర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.. పిలిగుండ్ల నుండి బహిష్కరణకు గురై అల్వాలలో జాయిన్‌ అవ్వడానికి ముందు … సదరు ప్రబుద్దుడు విధులకు గైర్హాజరైన నెలరోజుల కాలాన్ని మెడికల్ లీవ్ గా పరిగణించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారంట ఆ మంత్రివర్యులు..

గతంలో రెండు గ్రామాల్లో పనిచేసినప్పుడు కూడా ఈ హెచ్ఎం రంగస్వామిపై అనేక ఆరోపణలు ఉన్నాయంట … అప్పట్లో కేసులు నమోదు కాకుండా డబ్బులు వెదజల్లి .. ఆ ఆరోపణల నుంచి బయటపడ్డాడంట… అలాంటి వాడు మహిళా టీచర్ పై నిందలు వేసి జీవితంతో ఆటలాడుకుంటుంటే … చర్య తీసుకోకుండా మంత్రి, ఎమ్మెల్యే ఎలా సిఫార్సు చేస్తారని విద్యా శాఖలో చర్చ జరుగుతోంది.. ఇంత బహిరంగంగా విచారణ జరిపి నిర్ధారణ అయినా ప్రజాప్రతినిధులు కాపాడితే ఇకపై ఇలాంటి వారు రెచ్చిపోకుండా ఉంటారా అని చర్చించుకుంటున్నారంట.. మరి అలాంటి వాడిపై మంత్రికి, ఎమ్మెల్యేకి అంత ప్రేమ ఏంటో వారికే తెలియాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here