Home News Updates

అల ..గులాబీవనంలో….సత్యవతి రాథోడ్

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీకి తిరుగులేదు, డైనమిక్ లీడర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి సరిలేరు అని నిరూపిస్తూ, అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ధన్యవాదాలు తెలిపారు.

మున్సిపాలిటీల్లో తన సారధ్యంలో గొప్ప విజయాన్ని నమోదు చేసిన మంత్రి కేటీఆర్ గారికి తెలంగాణ భవన్ లో పూల మొక్కనిచ్చి అభినందనలు తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో టి.ఆర్.ఎస్ పార్టీకి ఏకపక్ష తీర్పునిచ్చిన ఓరుగల్లు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, నర్సంపేట మున్సిపాలిటీలలో టి.ఆర్.ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించి గులాబీ వనంగా మార్చిన ప్రజలకు, టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు, శ్రేణులకు అభినందనలు తెలిపారు.

ఈ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో, యువ నాయకులు కే. టి.ఆర్ సారధ్యంలో ఎన్నిక ఏదైనా విజయం టి.ఆర్.ఎస్ దేనని నిరూపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పోలింగ్ ముందే 80 వార్డులను ఏకగ్రీవం చేయడంతో పాటు..ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, వారిపై నమ్మకం లేదని మరోసారి మున్సిపల్ ఎన్నికల ద్వారా నిరూపించారన్నారు.

వందేళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి నూరేళ్లు నిండాయని, కేంద్రంలో ఆరేళ్ళు పాలించిన బీజేపీపై నమ్మకం లేదని తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 32కి 32 జిల్లా పరిషత్ లని టి.ఆర్.ఎస్ కి కట్టబెట్టి, నేడు మున్సిపాలిటీ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీకి సరిలేరు ఎవ్వరిని తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ గారి నాయకత్వానికి, కే.టి.ఆర్ గారి సారధ్యానికి జై కొట్టారన్నారు.

పల్లెలు, పట్టణాలు గులాబీ వనాలుగా మార్చిన ప్రజలకి, టి.ఆర్.ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.