Home News Updates

ఆ మంత్రికి కరోనా ఎఫెక్ట్ – కోట్లలో నష్టం

అయన ఒక మంత్రి.. ఆందులోను ఆరోగ్య శాఖా మంత్రి ..ఒక పక్క కరోనా పై అలెర్ట్ చేసే బాధ్యతలు. మరో పక్క తన బిజినెస్ కాపాడుకునే పని. నిజంగానే ఇబ్బందులకు గురవుతున్నాడు.

ఎవరి బాధ వారిది. వ్యక్తిగతంగా బాధ వచ్చి పడితే.. ఎంత దాచుకున్నా దాగదు. మాటల మధ్యలో వచ్చేస్తుంటుంది. ఎవరు ఊహించని రీతిలో కరోనా కారణంగా ఫౌల్ట్రీ పరిశ్రమ ఎంతలా ఎఫెక్ట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైరస్ కారణంగా కరోనా వ్యాప్తి చెందటం ఒక ఎత్తు అయితే.. మాంసాహారాన్ని తినటం ద్వారా కరోనా ప్రమాదం పొంచి ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. అందులో ఎలాంటి నిజం లేకున్నా.. నాన్ వెజ్ తిని కరోనాను తెచ్చుకునే కంటే.. నాలుగు రోజులు ఆగితే పోయేదేముందని.. నాన్ వెజ్ ప్రియులు సైతం దాన్ని ముట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. దీంతో.. కోళ్ల పరిశ్రమకు వాటిల్లుతున్న నష్టం అలా ఇలా లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కేజీ చికెన్ రూ.20లకే లభిస్తోంది.

కరోనా అలంటే ఎలా వున్నా తెలంగాణ మంత్రి ఈటెల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆయన పెద్ద ఫౌల్టీ బిజినెస్ మ్యాన్. ఆ విషయం ఎప్పుడు బయటకు రాకుండా.. భారీఎత్తున ప్రచారం జరగకుండా చూసుకున్నారు .. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ఆయన వ్యాపారం బాగా దెబ్బతిన్నది. అందుకే అయన వీలైనంత ఎక్కువగా చికెన్ తినాలంటూ కనిపించిన వారందరికి చెప్పటమే కాదు.. తాను ఏ వేదిక మీద నుంచైనా చికెన్ తినాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు . ఆయనగారికి ఉన్న కోళ్ల వ్యాపారమే కారణంగా చెబుతున్నారు.

అంతే కాదు కరోనా కారణంగా తాను చేస్తున్న కోళ్ల వ్యాపారంలో తాను అప్పటివరకూ ఏడెనిమిది కోట్ల మేర నష్టపోయిన వైనాన్ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here