Home News Politics

ఆ మంత్రిగారిని మంచితనం ముంచుతుందా….!

ఆ మంత్రికి ఆయన మంచితనం కొంప ముంచుతుందా .. ఆయన మెతకవైఖరి నియోజకవర్గంలో ఆయనను దెబ్బతీస్తుందా.. అవినీతి ఆరోపణలు ఏమీ లేకపోయినప్పటికీ సంబరాల రాంబాబు గా ఆ మంత్రికి పేరు ఎందుకు వచ్చింది.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే మంత్రి కూడా అయిపోయిన ఆయన నియోజకవర్గంలో మాత్రం ఎందుకు పట్టు సాధించలేకపోయారు.. లౌక్యం తెలియని మంత్రిగారిని అడ్డం పెట్టుకుని ఆయన చుట్టుపక్కల ఉన్న వారు రెచ్చి పోతున్నారా.. ఇంతకీ ఎవరా మంత్రి…ఎక్కడా ఆ కథ….

కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. మంత్రిగా తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారు.. కానీ తాను చేసిన అభివృద్ధిని జనాల్లోకి చెప్పుకోలేని పరిస్థితి అనుకుంది.. ఆయన పూర్తిగా క్లాస్ లీడర్ కావడంతో జనాల్లోకి చొచ్చుకెళ్లగలిగిన చొరవ మంత్రికి లేదు అనేది ఆయనకు ఉన్న పేరు..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ విషయంలో మాస్ లీడర్ గా గా ముద్రపడ్డారు..ఏ ఇంటికైనా వెళ్ళిపోయి బాబాయ్ అబ్బాయి అంటూ అందరినీ పలకరిస్తూ దూసుకెల్లే నైజం పేర్ని నానిది.. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో మంత్రి గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది..

రాష్ట్ర క్రీడా న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఒక్క దేవినేని ఉమా పేరు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తుంది. రెండో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే కొద్దిసేపు ఆలోచించి అవును మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే కొద్దిసేపు ఆలోచించి చెప్పాల్సి అంత సైలెంట్ వ్యవహారం కొల్లు రవీంద్ర ది..ఆయన మంచితనం ఆయన కొంప ముంచుతోంది.. ఆయన మాటకు వైఖరి వల్లే చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆయనకు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు..జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా చిన్న పదవి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అదృష్టవశాత్తు మంత్రి పదవి కూడా దక్కింది.. మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆయనకు మంత్రి పదవి వరించింది..ఆయన నిజానికి ఎమ్మెల్యే అవుతాడు అని కూడా ఊహించలేదు కానీ అదృష్టం కొద్దీ ఏకంగా మంత్రి కూడా అయిపోయారు.

మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం కూడా ఆయనకు చాలా మైనస్..ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆ నియోజకవర్గానికి చెందిన వారు ఎవరైనా సరే ముందుగా ఇచ్చే హామీ పూర్తి పూర్తి చేస్తామని. కానీ ఐదేళ్లు గడిచినా పోర్టు నిర్మాణ పనులు ఈ మధ్య కాలం మాత్రమే మొదలయ్యాయి.. నిర్మాణం పూర్తయి ఉంటే మంత్రి గారి మీద ప్రజాభిప్రాయం వేరుగా ఉండేది.. కానీ రీసెంట్ గా కోర్టు పనులు మొదలవడం వల్ల ప్రజల్లో నమ్మకం అనేది పెద్దగా పెరగలేదు..పోర్టు నిర్మాణం గనుక ఈ పాటికి సగం అన్న పూర్తి అయి ఉంటే మంత్రి గారికి చాలా మంచి పేరు వచ్చి ఉండేది.. పోటు వల్ల వచ్చే అభివృద్ధి వల్ల మంత్రికి విజయం అనేది తిరుగు లేకుండా ఉండేది..నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఎంత తీసుకుంటా మంటోఇచ్చిన నోటిఫికేషన్ కూడా మంత్రి కొల్లు రవీంద్ర కు కొంత మైనస్ గా మారింది. దీనిపైన ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. ఎక్కడ గ్రామసభలు పెట్టిన అక్కడ ప్రజలు అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది..

మొదట ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో న్యాయ క్రీడాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు.. నిజానికి ఆయన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు.. కానీ ఆయన ప్రతి విషయం నిదానంగా ఉండటం నాకెందుకులే అనుకోవటం కూడా ఆయనకు మైనస్ అయింది.. ఈ మంత్రి మీడియాలో ఫోకస్ అవ్వడం చాలా తక్కువే. అందుకే మంత్రులు ఎంతోమంది బాగా ఎలివేట్ అయినప్పటికీ కొల్లు రవీంద్ర మాత్రం ఇంకా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న ముగ్గురు వ్యక్తులు విపరీతంగా లాభపడ్డారు అనేది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ..అలాగే న్యాయ క్రీడాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత కూడా అదే వ్యక్తులు వెనక నుండి మొత్తం కథంతా నడిపిస్తూ.. మంత్రిగారికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు అని టాక్….

మరోవైపు ఇదే నియోజక వర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, బూరగడ్డ వేదవ్యాస్ లు కూడా ఒక్కటై రవీంద్రని ఒంటరిని చేశారు అని ప్రచారం కూడా జరుగుతోంది.. కొల్లు రవీంద్ర చుట్టుపక్కల వారి పెత్తనం ఎక్కువగా ఉండటంతో పార్టీ నేతలకు దూరమయ్యారని చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి కొల్లు రవీంద్ర కు వైసిపి నాయకులు ఇచ్చిన బిరుదు సంబరాల రాంబాబు.. ఎందుకంటే తన నియోజకవర్గంలో ఎక్కువగా ఆడంబరాలకు పోతూ ఉంటారని సంబరాలతో కొన్ని కార్యక్రమాలు ఎక్కువ చేపడుతూ ఉంటారని ఆయనకు పేరు.. బీచ్ ఫెస్టివల్ సు లేదా యూత్ కార్యక్రమాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న పేరు కూడా మంత్రి కొల్లు రవీంద్ర కు వుంది..

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కొల్లు రవీంద్ర మైనస్ లన్నింటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు చూడాల్సిన విషయం.. అందుకే మనిషి మంచోడే అన్న పేరు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు విజయం కోసం ఆయన కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here