Home News

హుజురాబాద్ నియోజకవర్గ నేతలతో మంత్రి గంగుల భేటీ..ఈటల పై కీలక వ్యాఖ్యలు

వ్య‌క్తులు పోయినంత మాత్రానా టీఆర్ఎస్ కు ఎలాంటి న‌ష్టం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ గారి ఫోటోనే టీఆర్ఎస్ గెలుపు మంత్రం, ఎవ‌రు గెలిచినా అదే కార‌ణం అన్నారు.ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త లేనేలేదని వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యాలే దీనికి నిద‌ర్శ‌నం అన్నారు. హుజురాబాద్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిదులతో క‌రీంన‌గ‌ర్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి భేటీ అయ్యారు. కేసీఆర్ గారి ప‌నితీరుకు, ప్ర‌భుత్వ ప‌నితీరుకు రెప‌రెండంగా వ‌రుస ఎన్నిక‌ల విజ‌యాలే తార్కాణ‌మ‌న్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ భ‌లంగా ఉంద‌ని, వ్య‌క్తులు పోయినంత మాత్రానా టీఆర్ఎస్ కు ఎలాంటి న‌ష్టం లేద‌న్నారు.

సాగ‌ర్లో జానారెడ్డే గెలుస్తాడ‌ని అంద‌రూ చెప్పినా..టీఆర్ఎస్ అభ్య‌ర్థి కేవ‌లం కేసీఆర్ పోటోతో భారీ మెజార్టీతో గెలిచిన విష‌యాన్ని గుర్తుచేశారు మంత్రి గంగుల‌. కేసీఆర్ వెంటే పార్టీ మెత్తం ఉంద‌ని, ఎన్నిక‌లేవైనా కేసీఆర్ పోటోనే మా గెలుపుమంత్ర‌మ‌న్నారు. క‌రీంన‌గ‌ర్లో తాను గెలిచినా, హుజురాబాద్లో ఈటెల గెలిచినా అది కేవ‌లం కేసీఆర్ గారి వ‌ల్లే సాద్య‌మయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ ప‌థ‌కాలే గెలుపు బాట‌లు వేస్తున్నాయ‌ని..వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని పార్టే ముఖ్య‌మ‌న్నారు గంగుల‌. హుజురాబాద్లో ఈటెల వ‌ల్ల ఎలాంటి న‌ష్టం లేద‌ని, క్యాడర్లో ఎవ‌రికీ అనుమానాలు లేవ‌ని, అంద‌రూ పూర్తిగా దీమాతో ఉన్నారు. పూర్తిగా పార్టీతో, టీఆర్ఎస్ తోనే వారు ఎప్పుడూ ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉంద‌ని, ఎవ‌రికీ ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌న్నారు మంత్రి గంగుల‌. ఈటల వ్య‌వ‌హారంలో పార్టీ త్వ‌ర‌లోనే అంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని, పుట్టా మధు వ్వ‌వ‌హారంలో ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబందం లేద‌ని, హైకోర్టులో వామ‌న్ రావు గారి తండ్రి ఫిర్యాదు మేరకు చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని, జ‌రుగుతున్న వ్య‌వహారాల్లో పార్టీకి ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌నన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here