Home News Updates

నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ మీనా కుమారికి మంత్రి ఈటల నివాళులు

నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ మీనా కుమారికి నివాళులు అర్పించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.

డాక్టర్ మీనా కుమారి గారు గత 29 సంవత్సరాలుగా నిమ్స్ లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక సెమినార్ కోసం లండన్ వెళ్లారు. ఆ సమావేశంలోనే కార్డియాక్ అరెస్ట్ తో పరమపదించారు. ఆమె అనునిత్యం పేదల ఆరోగ్యం కోసం తపించిన వ్యక్తి. పేద ప్రజలకు సొంత డబ్బులతో వైద్యం చేయించారు.మందులు కొనిపించేవారు. పేదల కోసమే ఆమె ఆలోచించే వారు, పెళ్ళికూడా చేసుకోకుండా ఆమె సేవలు అందిస్తున్నారు. ఆమె మరణం నిమ్స్ ఆసుపత్రికి తీరని లోటు. ఆమె ఏ విధంగా అయితే పేదలకు వైద్యం అందించాలని కోరుకున్నారో ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.