Home News Updates

చిరు కి ఇరకాటం ..

మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు ఇస్తారా.. అమరావతి రైతులకు అండగా వుంటారా.. ఇక నోరు విప్పక తప్పదా … మనసులో మాట చెప్పక తప్పదా … అనీ ప్రశ్నలు తెలుగునాట వినిపిస్తున్నాయి . గతంలో ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన సీఎం జగన్ నిర్ణయాన్ని గతంలో చిరంజీవి సపోర్టు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై చిరంజీవి మాత్రం అధికారికంగా స్పందించలేదు. అయితే చిరు మూడు రాజధానులకే సపోర్టుగా ఉన్నారని అమరావతి రైతులు భావిస్తున్నారు దీంతో చిరంజీవిని బుక్ చేశారు. అదే అయన ఇంటివద్ద తలపెట్టిన ఉద్యమ కార్యాచరణ .. అది ఏమిటంటే హైదరాబాద్ లోని చిరంజీవి నివాసం ఎదుట ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని ప్రకటనలో పేర్కొంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు చిరంజీవి మద్దతు తెలిపాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి ఇంటి ఎదుట దీక్ష చేస్తామని ప్రకటించిన జేఏసీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లోనూ కలకలం రేపుతోంది. అయితే చిరంజీవి వైపు నుంచి లేదూ సంచలన నిర్ణయం రాబోతోందని ఇటీవల మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు రాజ్యసభ టికెట్ రాబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఆయన అమరావతి రైతులకు మద్దతు ఇస్తారా… లేకుంటే అమరావతి జేఏసీ ఆయన్ను ఈ వివాదం లోకి లాగి అధికార పార్టీ వైపు వెళ్లకుండా గేమ్ ఆడుతోందా వేచి చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here