టాలీవుడ్ స్టార్లు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్స్ అయితే పెద్దగా రిస్క్ ఉండదని, రీమేక్స్‌కి సైన్ చేస్తున్నారు. ఎక్కడ సూపర్ హిట్ స్టోరీ ఉంటే, అక్కడికి వెళ్లిపోతున్నారు.. కేరళ నుంచి మొదలుపెట్టి కొరియన్ మూవీస్ వరకు ఏ కథ నచ్చితే, ఆ కథని రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్స్ రీమేక్ ల పై గురి పెట్టారు.

చిరంజీవి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా కథలు పరిశీలించాడు. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరినీ ఇంప్రెస్ చెయ్యడానికి పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లని కాంటాక్ట్ చేశాడు. ఫైనల్‌గా తమిళ ‘కత్తి’ సినిమాని ‘ఖైదీ నం.150’గా రీమేక్ చేశాడు. ఇక ఈ మూవీ తర్వాత మరో రెండు రీమేక్స్‌కి సైన్ చేశాడు చిరు.చిరంజీవి ఒక తమిళ కథని, మరో మళయాళీ స్టోరీని రీమేక్ చేస్తున్నాడు. మోహన్‌లాల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘లూసిఫర్’ని రీమేక్ చేస్తున్నాడు చిరు. ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే అజిత్ హీరోగా నటించిన ‘వేదళం’ సినిమాని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
అన్నింటిలో అన్నయ్యని ఇన్సిపిరేషన్‌గా తీసుకునే పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్‌లో కూడా అన్ననే ఫాలో అయ్యాడు. రీమేక్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో హిందీ హిట్ ‘పింక్’ సినిమాని ‘వకీల్‌సాబ్’గా రీమేక్ చేశాడు. అలాగే ఇప్పుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నాడు పవన్.’అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. బిజూ మీనన్ క్యారెక్టర్లో పవన్ కనిపిస్తోంటే, మోహన్‌లాల్ క్యారెక్టర్ని రానా ప్లే చేస్తున్నాడు. సాగర్.కె.చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతోందీ సినిమా.
కొత్త సబ్జెక్ట్ అంటే రిజల్ట్ గురించి కొంచెం ఆలోచించాలి. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఉంటుంది. అదే రీమేక్ అయితే కొంచెం రిలీఫ్‌గా ఉండొచ్చు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమానే రీమేక్ చేస్తున్నాం కాబట్టి, రిజల్ట్ ఫేవర్‌గా వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ ధీమాతోనే టాలీవుడ్ స్టార్లు బరిలో దిగుతున్నారు.