Home News Stories

మీరు ఫేస్ బుక్ వాడుతున్నారా…అయితే ఈ వార్నింగ్ మీకే…

ఫేస్ బుక్….ఈరోజు ఇది ప్రతి మనిషిలో ఒక అంతర్భాగం. దీని వాడకం ఎంతలా అంటే ఫేస్ బుక్ వాడకపోతే అవతలి వ్యక్తి తేడాగా చూస్తారేమో అనే అంతల. ఈ సామాజిక మాద్యమానికి అలవాటయిపోయి చాలా మంది ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నారు. దీనికి అడిక్టైతే అంతే మరి స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని ఎక్కడ పడితే అక్కడ ఫేస్ బుక్‌ చూసుకుంటూ కాలం గడిపేసే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతుంది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఫేస్ బుక్ చూసుకుంటూ.. షేర్స్, లైక్స్ తో నెట్టింట్లో అందరికీ ఇదో కేరాఫ్‌ అడ్రస్‌…

సోషల్ మీడియాలో ఫేస్ బుక్ మాయ అంతా ఇంతా కాదు. ఇది వాడే వారి సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో.. సమాచార మాధ్యమాల ప్రభావంతో కుటుంబ విలువలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. ఇంట్లో ఏంటి బెడ్రూంల్లో, ఆఫీసుల్లోనూ,ప్రయాణాల్లోను ఫేస్ బుక్‌తో గడిపేస్తున్నయువతకిది ఒక వ్యసనంగా మారింది.

ఫేస్ బుక్ డేటాని మిస్ యూజ్ చేస్తున్నారన్న వివాదంలో ఎఫ్‌బీ చిక్కులు కొనితెచ్చుకుంది.. వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ బహిరంగ క్షమాపణ చెప్పారు… దీనంతటికీ కారణం ఐదు కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థకు అక్రమంగా చేరడం… ఆ డేటాని సంస్థ దుర్వినియోగం చేయడం… దీంతో సోషల్‌ మీడియాలో ఇప్పుడిదోహాట్‌ టాపిక్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్‌తో ‘డిలీట్‌ ఫేస్‌బుక్‌’ నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మీ వ్యక్తిగత సమాచారం మాటేంటి? సురక్షితమేనా? ఏ రూపంలో ఎలాంటి సర్వీసులు డేటాపై కన్నేస్తున్నాయి? వాటినెలా అడ్డుకోవాలి? మీ ఎఫ్‌బీ ఎకౌంట్‌ని ఎలా సురక్షితం చేసుకోవాలి?

సుమారు 5 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాలు ఇటీవల హ్యాక్ అవ్వడంతో నష్టనివారణకు దిగిన ఫేస్ బుక్ సంస్థ, ఖాతాదారులకు కీలక సలహాలు ఇచ్చింది. ప్రతి ఒక్క యూజర్, ఫేస్ బుక్ లో లాగౌట్ అయ్యి, రీ లాగిన్ కావాలని, ఈ క్రమంలో ‘టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్’ పద్ధతిలో సాగుతుందని తెలిపింది. దీని వల్ల ఖాతాలకు మరింత భద్రత ఏర్పడుతుందని పేర్కొంది. రీ లాగిన్ అయిన తరువాత, కుడివైపు పైన కనిపించే సెట్టింగ్స్ లోకి వెళ్లి, ‘సెక్యూరిటీ అండ్ లాగిన్’ ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో ‘చేంజ్ పాస్ వర్డ్’, ‘లాగిన్ విత్ యువర్ ప్రొఫైల్ పిక్చర్’ అనే ఆప్షన్లు కనిపిస్తాయని తెలిపింది. వీటి కింద ‘టూ ఫాక్టర్ ఆథెంటికేషన్’ అన్న ఆప్షన్ ను జోడించామని, దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఎకౌంట్ ను మరింత భద్రంగా ఉంచుకోవచ్చని పేర్కొంది.

ఇందులో టెక్ట్స్ మెసేజ్ ఆప్షన్ ఎంచుకుంటే, రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఆరు అంకెల కోడ్ ను పంపిస్తామని, లాగిన్ కావడానికి దాన్ని ఎంటర్ చేయాల్సి వుంటుందని ఫేస్ బుక్ ప్రకటించింది. ఇదే సమయంలో గూగుల్ ఆథెంటికేటర్ ద్వారా కూడా లాగిన్ కావచ్చని వెల్లడించింది. గూగుల్ ద్వారా అయితే, కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను రిజిస్టర్డ్ మొబైల్ నుంచి స్కాన్ చేయాల్సి వుంటుందని తెలిపింది. తాజాగా మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్లు హ్యాకింగ్ బారిన పడ్డారు. అయితే ఆ హ్యాకర్స్ ఎవరనేది ఇంకా తేలలేదు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కు 200 కోట్ల యూజర్స్ ఉండగా 27 కోట్ల యూజర్లు ఒక్క ఇండియాలోనే ఉన్నారు. దీంతో ఫేస్ బుక్ ఈ కీలక సూచనలను తమ వినియోగదారులకి పంపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here