Home Entertainment Cinema

అమ్మో వేధింపుల లిస్టులో బిగ్ బీ కూడానా…?

మీటూ మువ్ మెంట్ ఇప్పుడు బాలీవుడ్ ,టాలీవుడ్ అని లేకుండా అన్ని రంగాలను కుదిపేస్తూ రోజుకో సంచలనానికి కారణం అవుతుంది. ఇక బాలీవుడ్‌లో అయితే.. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుందో అనే ఆందోళన నెలకొంది. ఇండస్ట్రీలోని బడా వ్యక్తుల తెర వెనుక బాగోతాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీలు, బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులపై కూడా సంచలన ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్‌ బాద్ షా,బిగ్ బీ అమితాబ్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీ బిగ్ బి అమితాబ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మీటూకు మద్దతుగా ఆయన మాట్లాడటం.. అంతకంటే పెద్ద అబద్ధం మరోటి ఉండదని పేర్కొన్నారు. త్వరలోనే అమితాబ్ అసలు స్వరూపం బయటపెడతానని హెచ్చరించారు. సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌గా ఉన్న సప్నా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కూడా.

ఈ మధ్య ఒక ఇంటర్యూలో బిగ్‌ బీని మీటూ ఉద్యమంపై స్పందించాల్సిందిగా కోరారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. ‘ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. మన దేశంలో పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, ఇది తన మనసును తీవ్రంగా కలచివేస్తోందని అమితాబ్ అన్నారు. మహిళలకు దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వకపోతే మన దేశంపై చెరపలేని మచ్చ పడుతుందన్నారు.

ఈ ఇంటరూ చూసిన సప్నా భవ్నానీ బిగ్ బి పై సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘బిగ్ బీ సర్‌.. మీరు నటించిన పింక్‌ సినిమా వచ్చింది, వెళ్లిపోయింది. అదేవిధంగా మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజాలన్నీ బయటపడతాయి. నా ట్వీట్‌ చూసి మీరు తెగ కంగారుపడతారు. చేతి గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. కొరుక్కోవడానికి మీకున్న గోర్లు కూడా సరిపోవు’ అటూ ట్వీట్ చేసింది. సప్నా భవ్నానీ ట్వీట్‌ చేశారు..