Home News Stories

మీడియా వర్సెస్ టాలీవుడ్: గెలుపెవరిది?

ఇక టీవీ9 లో అత్యధిక కార్యక్రమాలు ఫిలిం బేస్డ్.. ఏది వైరల్ ఏది రియల్ అనే కార్యక్రమం పూర్తిగా సినిమా గాసిప్స్ మీదే నడుస్తుంది. ఈ చానెల్ లో ఈ కార్యక్రమమే అత్యధిక టీఆర్పీ లు తెచ్చేది. సినిమా వాళ్ళు దూరమైతే వారికి ఎంత నష్టమో బాగా తెలుసు.

సినిమా వార్తలు లేకుంటే న్యూస్ ఛానల్స్ మనుగడ లేదా? న్యూస్ ఛానల్స్ లేకుంటే సినిమాలకి సరైన ప్రమోషన్ ఉండదా? ఈ ప్రశ్న చెట్టు ముందా? విత్తు ముందా? అన్నట్లు తోస్తుంది… కానీ సినిమా వార్తలు లేకపోతె న్యూస్ ఛానల్స్ బతికి బట్టకట్ట లేవని నిరూపిస్తోంది ఈ మధ్య పరిణామాలు.

శ్రీ రెడ్డి వయా పవన్ కళ్యాన్ గా మొదలైన ఈ వార్ ఎలక్ట్రానిక్ మీడియా వర్సస్ టాలీవుడ్ గా మారిపోయింది. చివరికి ఎవరు గెలిచారు అన్నది ఇక్కడ ప్రశ్న. దీనికి ఒకటే జవాబు సినిమా వార్తలు లేకుండా న్యూస్ ఛానల్స్ కి తాము సెకండ్ హాఫ్ యాన్ అవర్ నడపలేవన్నది అర్ధమైపోతోంది.

దీన్ని సవాల్ చేస్తున్నట్లు టీవీ5 బిజినెస్ ఎడిటర్ వసంత్ మరో అడుగు ముందుకు వేశారు. సినిమా హీరోస్ నిజ జీవితంలో జీరోస్ అని తీవ్ర పదజాలంతో తప్పుబట్టారు. టీవీ 5 యాంకర్ చెప్పినది ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించినా న్యూస్ ఛానల్స్ కి సినిమా నటులే నిజమైన హీరోలుగా తేలిపోయింది.

న్యూస్ ఛానల్స్ లేకుండా గతంలో ప్రేక్షకులు సినిమాలు చూడలేదా? డిజిటల్ మీడియా వచ్చాక సినిమా ప్రేక్షకుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది యౌట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ అని చెప్తే కాదనే వారు ఉండరేమో?

ఇక్కడ పవన్ కళ్యాన్ ఫిలిం ఛాంబర్ వద్ద హంగామా తదనంతర పరిణామాలలో కొన్ని చానెల్స్ ని బ్యాన్ చేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తున్నట్లు టీవీ5 బిజినెస్ ఎడిటర్ వసంత్ మరో అడుగు ముందుకు వేశారు. సినిమా హీరోస్ నిజ జీవితంలో జీరోస్ అని తీవ్ర పదజాలంతో తప్పుబట్టారు. వారి ఆడియో వేడుకల్లో ఒకర్ని మరొకరు పోగుడుకోవడమే సరిపోతుందని, వీరి వార్తలు ఇవ్వడమే వెస్ట్ అని విమర్శించారు. దానికి కొనసాగింపుగా తర్వాతి రోజు కూడా ఇదే విషయం చెప్పారు. ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏమిటంటే… అయన చెప్పిన తర్వాతి రోజే భరత్ అను నేను సెలబ్రేషన్స్ ఆ చానెల్ వాడింది. నా పేరు సూర్య, మహానటి వేడుకల్ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారు. టీవీ 5 యాంకర్ చెప్పినది ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించినా న్యూస్ ఛానల్స్ కి సినిమా నటులే నిజమైన హీరోలుగా తేలిపోయింది.

ఎక్క‌డి హీరోల‌క్క‌డే గ‌ప్‌చుప్‌..

ఇక టీవీ9 ఇటువంటి వివాదాలప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. చేయాల్సిందంతా చేసేసి సినీ వర్గాలను దువ్వే ప్రయత్నం చేస్తోంది. ఏది వైరల్ ఏది రియల్ అనే కార్యక్రమం పూర్తిగా సినిమా గాసిప్స్ మీదే నడుస్తుంది. ఈ చానెల్ లో ఈ కార్యక్రమమే అత్యధిక టీఆర్పీ లు తెచ్చేది. సినిమా వాళ్ళు దూరమైతే వారికి ఎంత నష్టమో బాగా తెలుసు. ఇక ఏబీఎన్, మహా న్యూస్ వీటికి కూడా ప్రభావం తప్పక ఉంటుంది.

ఈ నేపధ్యంలో జర్నలిస్ట్ సంఘాలు, ఎడిటర్లు రంగంలోకి దిగారు. ఎలక్ట్రానిక్ మీడియాకి జరిగే ప్రమాదాన్ని గ్రహించి చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ పై పొలిటికల్ ప్రెషర్ కూడా ఇప్పిస్తునట్లు తెలుస్తోంది.

ఫిలిం ఛాంబర్ బ్యాన్ అనేది చూస్తుంటే … ‘మా’  శ్రీరెడ్డిని బహిష్కరించి చివరికి రావమ్మా మెంబెర్ షిప్ ఇస్తాం అన్నట్లు …శుభం కార్డుతో ముగిసేట్లే ఉంది.

ఈ మొత్తం తతంగంలో పరువు నిలబెట్టుకున్నది మాత్రం ఎన్టీవీ మాత్రమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here