Home News Stories

మీడియా వెర్సెస్ పోలీస్ …?

వార్తలు వార్తలుగా రాయడం తప్పు అవుతుందా … ఒక వేళ తప్పు రాసినా రాసిన వాళ్ళను ఏకిపారేస్తారా … నిజాలపై దృష్టి పెట్టలేరా … అవును ఇప్పుడు పాలకులకూ., అధికారులకు అంత టైం లేదు. కాదు.. కుదరదు అంటే ఆ వార్త సంస్థ పై యుద్ధం ప్రకటిస్తారు … అది ప్రత్యక్ష యుద్ధం కావచ్చు. లేదా పరోక్ష ఎటాక్ కావచ్చు. తెలుగు రాష్ట్రాలలో మీడియా పరిస్థితి తెలిసిన వారు ఎవరికైనా ఈ నిజం అవగతం అవుతుంది. అసలు విషయానికి వద్దాం.

“దొంగలతో దోస్తి” అనే ఆర్టికల్ ఈనాడులో ప్రచురితమైనది తెలంగాణలోని పోలీసు బలగాలను ఉద్దేశించిన ఆరోపణలతో ఆ వార్త వచ్చింది. ఆ వెంటనే పో లిసు శాఖ ఖండన కు సమాయత్తమైంది. ఆ వార్తలోని విషయాలు పూర్తిగా అబద్ధం మరియు సత్యానికి దూరంగా ఉన్నాయని ., పోలీస్ వర్గాలు ఖండన ఇచ్చాయి. డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ తరఫున ఈ ఖండన వచ్చింది. అయితే ఈ గొడవతో క్రైమ్ రిపోర్టర్స్ కాస్త ఇబ్బందికి లోనయ్యారు. వార్తలు రాస్తే తప్పా అంటూ రివర్స్ అయ్యారు. ఎంత సేపూ పొగడ్తలతో ముంచి తే అదే ఆనందమా అంటూ లోలోపల ప్రశ్నిస్తూ., పోలీస్ శాఖకు సోషల్ మీడియా లో కోన్తెర్స్ ఇస్తున్నారు … అలాంటి ఒక కౌంటర్ ఇక్కడ చూద్దాం.


ఒక జర్నలిస్ట్ మిత్రుడి స్పందన చూడండి…..

మీరు చేసిన గొప్పతనాలు, దేశములోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ అని రాసింది కూడా ఇవే పేపర్లు ఇక్కడ చానల్స్ వాళ్లే సర్.
పోలీసుల పైన వ్యక్తిగతంగా మాకు ఎప్పుడూ కక్ష ఉండదు మీకు వీక్లీ ఆఫ్ లు కావాలని హోంగార్డులకు జీతాలు పెంచాలని ఎన్నో వార్తలు రాశాము.ఆర్డర్లీ వ్యవస్థను రూపుమా పాలని, ఉన్నతాధికారుల వేధింపుల పై బట్టబయలు చేసాం.

ప్రతిసారి మీ గొప్పతనాన్ని నిలువెత్తు చాటింది కూడా మేమే. డిపార్ట్ మెంట్ లో ఏ ఒక్కరు మంచి పని చేసిన ఆ పని డిపార్ట్మెంట్ మొత్తానికి తీసుకు వచ్చాము. శభాష్ పోలీస్ అన్న అని ప్రోత్సహించాము. జమ్మికుంటలో ఓ సి.ఐ బావిలో దిగి ప్రాణాలు కాపాడే తే జయహో తెలంగాణ పోలీస్ అన్నాము. షీటీం గురించి, ఎలక్షన్లో తెలంగాణ పోలీసుల పాత్ర గురించి అన్ని రాసింది మేమే. కనీసం ప్రెస్ నోట్ మీద సంతకం లేకుండా.. అసలు ఆ అలవాటే చేసుకోకున్న మీరు చెప్పిందే రాశాము.. రాస్తాం కూడా..?

దిశ ఎన్కౌంటర్లో సజ్జనార్ సార్ ని ఆకాశం ఎత్తాము. రాజ్యాంగానికి విరుద్ధమైన.. ఎక్కడ అలాంటి రిపోర్టింగ్ చేయలేదు. చేసే పనులు బాగున్నాయని స్పెషల్ సాంగ్ లతో పోలీసుల పైన ప్రేమ కురిపించాము.

ప్రజల వాయిస్ ని ప్రపంచానికి చూపించి తెలంగాణ పోలీస్ దమ్మున్న వాళ్ళని దేశం మొత్తము అనేలా చేసాం. కానీ అవన్నీ మరిచి పోయి ఒక వార్తతో మా రిపోర్టర్ లే పోలీస్ శాఖను బాద్నమ్ చేస్తున్నారు అంటున్నారు.. మరి అంత పరువు తీస్తే నష్టపరిహారం కింద కోర్టుకు వెళ్లొచ్చు కానీ ప్రెస్మీట్లు పెట్టి జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.

పోలీస్ శాఖలో అక్రమార్కులు పెరుగుతున్నారు.. అవినీతి పెరుగుతుంది.. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు.. పైరవీలు పెరుగుతున్నాయి అని రాస్తే జీర్ణించుకోలేకపోయారూ.?

నిజానికి డిపార్ట్మెంట్లో నాయకులకు అనుకూలంగా పోస్టింగ్లు జరగడం లేదా ? ఏ ఎమ్మెల్యే సిఫార్సు లేకుండానే పోస్టింగ్లు ఇచ్చారా ? గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా ?

ఆ వార్త హెడ్డింగ్ లో తప్పు జరగవచ్చు.. కానీ వార్తలో నిజం ఉంది. అది మొత్తం శాఖకు ఎలా వర్తిస్తుంది అనుకున్నారు..
సీఎం హోదలోనే కేసీఆర్ సర్ రెవెన్యూ శాఖ ని తప్పుపట్టారు. అలా అని ఆ శాఖకు మొత్తం వర్తిస్తుందా.. నిజాయితీగా పనిచేసేవారు చాలా మంది ఉన్నారు.

అదే ఏసీబీ ఇచ్చిన రిపోర్టులో పోలీస్ శాఖ మూడో ప్లేస్లో ఉంది.. దానిపై ఏమనాలి.. ఐఏఎస్ ల కన్నా కరెంటోళ్ల జీతాలు ఎక్కువ ఉన్నాయి అయినా అవినీతిలో రెండో ప్లేస్లో ఉంది వారిని ఎలా పోల్చాలి.

మంచి చేస్తే మంచి అని.. చెడు చేస్తే చెడు అని.. డిపార్ట్మెంట్లో ఒక్కరు చేసిన అందరికీ వర్తిస్తుంది.. అదే ఇప్పటి వరకు జరిగింది.. రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది.. సో అంతా మాత్రాన ఉలిక్కిపడి మమ్మల్ని ఇంత టార్గెట్ చేయడం తగదు సర్..

ఇన్ని నిఘా సంస్థలు ఉన్న నిజాలు మీకు మాత్రమే తెలిసి పబ్లిక్ తెలియకపోవడం ఎంతో ప్రమాదకరం.. ప్రజాస్వామ్యం ని బతికించాలని ఉంటే మీడియా ఇలాంటి వార్తలు కూడా రాయాలి. నిజాలు అందరికి తెలియాలి.

ఇది ఒక జర్నలిస్ట్ ప్రశ్న. వ్యవస్థ అన్నాక ఏదో ఒక చోట లోపాలు వుంటాయి . మీడియా అనేది వాటిని శోధిస్తూ వుంటుంది .. రాస్తూ వుంటుంది. వాటిని సరిచేసుకోవడం ప పాలకులు., అధికారవర్గం పని కావాలి. అంతేకానీ ఆగ్రహం చెందితే ఎవరికీ నష్టమో ఆలోచించుకోవాలి .. పత్రికలను ., చానల్స్ నూ ఒత్తిడితో కంట్రోల్ చేయవచ్చు . లేదా కోనేయవచ్చు .. కానీ నిజమనే నిప్పును అంటుకుంటే అది కాల్చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here