Home News Updates

శోకసంద్రంలో మేడారం..కరోనాతో ఆలయ పూజారి మృతి

ములుగు జిల్లా మేడారంలో విషాదం చోటు చేసుకుంది. సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారి సిద్దబోయిన సమ్మారావు కరోనాతో మృతి చెందారు. సమ్మారావుకు ఒక నెల క్రితం కరోనా సోకింది. అయితే కరోనా నుంచి కోలుకున్నాకా మళ్లీ అనారోగ్య సమస్యలు తిరగబెట్టాయి. శ్వాస సమయలు,ఊపిరి తిత్తుల్లో ఇన్ ఫెక్షన్ చేరడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం సమ్మారావు భార్య సృజన కరోనాతో మృతి చెందింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

ఆసియా ఖండంలోనే జరిగే అతిపెద్ద ఆదివాసి సమ్మేళనంగా ప్రసిద్ది చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పలు రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. 2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీలను ఈ మధ్యే ఆలయ పూజరులు ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 తేదీ వరకు ఈ జాతర నిర్వహించనున్నారు. మాఘమాసంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాజాతరను నిర్వహించనున్నారు. అయితే పూజారి సమ్మారావు మృతితో మేడారంలో విషాదం చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here