Home Education

మే3న ఇంటర్ పరీక్షలు!

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్‌ కంటే రెండు నెలలు ఆలస్యంగా పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో అకడమిక్‌ కేలండర్‌ రూపకల్పన, పరీక్షలకు సంబంధిం చిన షెడ్యూల్‌ రూపకల్పనపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌ చివరి నాటికి కనీసం 68 నుంచి 74 రోజులపాటు ప్రత్యక్ష విద్యా బోధన నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపోందిస్తున్నారు. మరోవైపు మే 3వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూల్‌ ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించేందుకు బోర్డుఅధికారులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇట్టి పరీక్షలను 70% సిలబస్‌తోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నా యి. అయితే తొలగించే 30% సిలబస్‌పై కూడా విద్యార్థులతో అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు చేయించేలా చర్యలు చేపడుతోంది. ఎన్విరాన్‌మెంటల్, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షలపై బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌కు కేంద్రం సిలబస్‌ను తగ్గించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్‌ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ఆలోచనలు అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తీసుకొని, ఉన్నత విద్యా మండలితో సమావేశం కావా లని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. మండలితో నిర్వహించే సమావేశంలో యూనివర్సిటీలు పాల్గొననున్నాయి. కనుక అందులో ఎంసెట్‌ సిలబస్‌ ఎంత ఉండాలో నిర్ణయించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

కరోనా కారణంగా విద్యా బోధన దెబ్బతిన్నప్పటికీ ఆన్‌లైన్‌, డిజిటల్‌, టీవీ ద్వారా విద్యా బోధనను విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిర్వహించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నప్పటికీ ఆన్‌లైన్‌, డిజిటల్‌ విద్యాబోధనను కొనసాగించనుంది. మరోవైపు ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్నందున విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలను సైతం నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. అందుకు అనుగుణంగానే అకడమిక్‌ కేలండర్, పరీక్షల షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.

గతేడాది 2020 మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులను పాస్‌ చేసేలా ప్రభుత్వానికి ఫైలు పంపించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా కారణంగా గతేడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. దీంతో గత మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు ఇచ్చి పాస్‌ చేసింది. కానీ ఫస్టియర్‌లో ఫెయిల్‌ అయిన 1.92 లక్షల మంది విద్యార్థుల విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వారిని కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని బోర్డు భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here