Home Entertainment Reviews

సునీల్ 20 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేర్చిన రవితేజ.. డిస్కో రాజా

అదేంటి.. సునీల్ ఇండస్ట్రీ కి రావడానికి.. ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ కదా. రవితేజ ఏం చేశాడు అనుకుంటున్నారా.. నిజమే సునీల్ ఇండస్ట్రీలో స్టార్ కావడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ అన్ని సంవత్సరాలు ఆయనకు తోడుగా ఉన్న కూడా స్నేహితుడి కల మాత్రం నెరవేర్చలేకపోయాడు మాటల మాంత్రికుడు. తన సినిమాలలో కూడా సునీల్ ను కేవలం కమెడియన్గా మాత్రమే చూసాడు.. అలాంటి పాత్రలే రాశాడు కూడా. కానీ తొలిసారి సునీల్ కోసం ఒక విలన్ క్యారెక్టర్ రాసాడు దర్శకుడు VI ఆనంద్.

VI ఆనంద్ తాజాగా తెరకెక్కించిన డిస్కో రాజా సినిమా జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చింది. గత సినిమాలతో పోలిస్తే మాస్ రాజా ఈ సినిమాలో ఎనర్జిటిక్ గా ఉన్నాడు అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అయితే సినిమా చూసిన వాళ్ళకు రవితేజ నటనతో పెద్దగా సర్ప్రైజ్ కాలేదు.. కానీ సునీల్ మాత్రం అదిరిపోయే షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్ని కేవలం కమెడియన్ గా మాత్రమే చూసిన మనకు డిస్కో రాజా సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు. సెకండ్ హాఫ్ లో సునీల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. భయస్తుడుగా ఉంటూ రవితేజకు నమ్మినబంటుగా ఉండి చివరికి ఆయనే మోసం చేసే పాత్ర ఇది.. మోసం కూడా కాదు ఏకంగా చంపేసే పాత్ర. క్లైమాక్స్ లో దర్శకుడు ఆనంద్ ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా పేలలేదు. ఇక సునీల్ కూడా విలన్ క్యారెక్టర్ లో అదిరిపోయాడు. గెటప్ కూడా కొత్తగా ట్రై చేసాడు.

అయితే ఇరవై ఏళ్లుగా ఆయనను కామెడీ వేషాల్లో చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా విలన్గా జీర్ణించుకోవడం కష్టమే. అందుకే తెరపై ఎంత విలనిజం పండించిన కూడా ఫేస్ లో కామెడీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి సునీల్ మ్యాగ్జిమం ట్రై చేశాడు. అసలు ఈయన ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవుదామని.. కానీ త్రివిక్రమ్ లాంటి దర్శకులు సునీల్ పూర్తిస్థాయి కమెడియన్ గా మార్చేసారు. ఇలాంటి సమయంలో డిస్కో రాజా సినిమాలో ప్రతినాయక పాత్రలో మెరిశాడు సునీల్. దీంతోపాటు కలర్ ఫోటో అనే సినిమాలో కూడా పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్నాడు సునీల్. ఏదేమైనా కూడా ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత తన కలను నెరవేర్చుకున్నారు ఈ భీమవరం బుల్లోడు. మరి ఇకపై కూడా సునీల్ ను మనవాళ్లు విలన్ గా చూపిస్తారా లేదా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here