Home News Stories

వారసుడు ఇతనేనా? వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ రెండో కొడుకు వీడియో..

పవన్ కళ్యాణ్ వారసుడు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అకిరా నందన్. రేణుదేశాయ్ ముద్దుల తనయుడు ఈయన. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ముందుగా గుర్తొచ్చేవాడు. కానీ ఇప్పుడు పవన్ వారసుడు మరొకరు వచ్చేసాడు. జనసేన డ్రెస్ వేసుకుని అదిరిపోయే స్టైల్ లో నడుచుకుంటూ వస్తున్న ఆ బుడ్డోడిని చూసి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఈయన కూడా జనసైనికుడు అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ మూడో భార్య కొడుకు మార్క్ శివ శంకర్ పవనోవిచ్ ఫోటోలు వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులు ఈ కుర్రాడి ఫోటోలు బయటికి రాలేదు. కానీ వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా ఊగిపోతుంది. అన్నయ్య వారసుడు అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటూ ఈ బుడ్డోడు ఫోటోలను వైరల్ చేస్తున్నారు జనసైనికులు. ఇప్పటివరకు కొడుకు ఫోటోలు దాచిపెట్టిన ఇప్పుడు మాత్రం బయటకు వచ్చేసాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ మాదిరే లాల్చీ పైజామా వేసుకొని అచ్చం తండ్రి నడుచుకుంటూ వస్తున్నాడు ఆ బుడ్డోడు.

రెండేళ్ల కింద పుట్టిన ఈ కుర్రాడికి అన్నయ్య పేరు కలిసొచ్చేలా శివశంకర్ అని పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. టిక్ టాక్ లో ఫేస్బుక్లో సోషల్ మీడియా ప్రతి ప్లాట్ఫాం లో ప్రస్తుతం ఈ చిన్నోడు ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here