Home Videos

రసమయి బాలకిషన్ త్వరగా తేల్చుకో..నియోజకవర్గ ప్రజలనాడి ఇదే

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాజీ మంత్రి ఈటలతో సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరు. గతంలో బహిరంగంగా పార్టీ వేదికల పైనే ఈటల మాదిరిగానే సంచలన వ్యాఖ్యలు చేశారు రసమయి. తాము కడుపులో ఏమీ దాచుకోమని.. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని.. తమకు అబద్దాలు రావంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు ఈటల. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాల వల్ల ఈటలతో కలిసి రసమయి ముందుకు సాగారన్న వాదనలు ఉన్నాయి.

అప్పట్లో గులాబీ జెండాకు ఓనర్లం మేము అని ఈటల కామెంట్ చేసిన మరుసటిరోజు..ఆయనతో హైదరబాద్‌లో భేటీ అయ్యారు రసమయి. ఒక కార్యక్రమంలో రసమయి పాడిన పాటపై చర్చ కూడా జరుగుతోంది. ఈటల టీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే రసమయి పరిస్థితి ఏంటన్న ప్రశ్న నడుస్తుంది. మానుకొండూరు నియోజకవర్గంలోనూ ఈటలతో రసమయి కలిసి వెళ్లాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here