Home News Updates

సూరారంలో మల్లారెడ్డి కాన్సర్ హాస్పిటల్ ప్రారంభం

ఈ రోజు మేడ్చల్ జిల్లా,కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని సూరారం లోని మల్లారెడ్డి హెల్త్ సిటీ లో
అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో మల్లారెడ్డి కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు Ch. మల్లారెడ్డి గారితో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ప్రజలకు తక్కువ ఖర్చుతో క్యాన్సర్ వ్యాధులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశం తో ఈ ఆసుపత్రి ప్రారంభించారు అని ఈ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ గా మారాలన్నదే మన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ గారి లక్ష్యము అని నిరుపేద ప్రజలకు మల్లారెడ్డి ఆసుపత్రి ద్వారా ప్రతి రోజు దాదాపు 1000 మందికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో కలెక్టర్ యం.వి రెడ్డి ,యం.యల్.సి శంబీపూర్ రాజు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ కే.పి వివేకానంద,యం.యల్.ఏ సుభాష్ రెడ్డి,కాళోజి నారాయణ రావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.కరుణాకర్ రెడ్డి ,యం.ఆర్.జి.ఐ సెక్రటరీ సి.హెచ్ మహేందర్ రెడ్డి ,యం.ఆర్.ఐ.యం.ఎస్ చైర్మన్ డాక్టర్ సి.హెచ్ భద్రా రెడ్డి ,కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here