Home News Politics

మాకు డబుల్ ఇవ్వాల్సిందే…అధిష్టానానికి అల్టిమేటమ్….

ఒక కుటుంబంలో ఒకరికే టికెట్‌ అన్న కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తప్పుబడుతున్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ ఎన్నికల వరకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా రు. ఒకవేళ మినహాయింపు ఇవ్వకపోతే చేజేతులా 10 నుంచి 15 స్థానాలు కోల్పోవాల్సి వస్తుందని ఇన్నర్ టాక్ వినిపిస్తున్నారు.

ఫలానా నియోజకవర్గంలో ఫలానా వారైతేనే గెలుస్తారని ప్రజ లు అనుకుంటున్నప్పుడు కొత్త నిబంధనతో ఉపయో గం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల తమ కుటుంబ సభ్యులు లేదా బంధువులకు ఇవ్వకపోతే అక్కడ సరైన అభ్యర్థులు కూడా లేరని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. కుటుంబంలో ఒక్కరికే టికెటన్న నిబంధన మంచిది కాదని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి కూడా ప్రారంభించారు. దీనికి తగ్గట్టుగానే ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి బలం ఉందన్న వివరాలతో అభిప్రాయాలను వినిపిస్తున్నారు.

నల్లగొండ జిల్లాలోనే కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు కీలక నేతలు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వా లని కోరుతున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి బరిలోకి దిగనున్న సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తన కుమారు డు రఘువీర్‌రెడ్డికి మిర్యాలగూడ టికెట్‌ ఇస్తే గెలిపిం చుకువస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇస్తే వ్యతిరేకత పెరుగుతుందని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న తేరా చిన్నపరెడ్డిని పార్టీలోకి తీసుకుని నాగార్జునసాగర్‌ టికెటిచ్చి, జానారెడ్డిని మిర్యాలగూడకు పంపితే 2 సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అంటోంది. కోదాడ నుంచి మళ్లీ పోటీ చేయాలని ఉత్తమ్‌ భార్య పద్మావతిరెడ్డి భావిస్తున్నారు.

పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి అడుగుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మల్లయ్య యాదవ్‌ పోటీచేస్తే ఫరవాలేదని, ఆయన కాకుండా ఇతరులకు ఇస్తే సీటు పోగొట్టుకున్నట్లేనని కాంగ్రెస్‌ చెబుతోంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు టికెట్‌ ఆశిస్తున్నారు. తాను పార్టీ ప్రతిపాదించిన కుటుంబంలో ఒక్కరి నిబంధన కిందకు రానని, తాను తన అన్న వేర్వేరు కుటుంబాలు అని ఆయ న అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతి భావిస్తున్నారు.

ఆమెకు టికెట్టిస్తే నియోజకవర్గాన్ని చేజార్చుకున్నట్లేనని జిల్లా కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గద్వాల నుంచి పోటీ చేస్తున్న డీకే అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి దేవరకద్ర లేదా మక్తల్‌ రెండింటిలో ఏదో ఒక స్థానం ఇవ్వాలని అడుగుతున్నారు. మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీరెడ్డి తాను సంగారెడ్డి కాకపోతే మరో నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేస్తానని అంటున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్‌ తనకు టికెట్‌ ఇస్తే వరంగల్‌ తూర్పు నుంచి గెలిచి వస్తానని చెబుతున్నారు. వీరంతా ఇప్పటికే టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.


వచ్చే ఎన్నికల కోసం టికెట్‌ ఖరారైనట్టేనని భావిస్తున్న కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. వారి తరఫున కూతుళ్లు ప్రచార బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి నియోజకవర్గం లో జగ్గారెడ్డి తరఫున ఆయన కూతురు జయారెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వయసు లో చిన్నే అయినా రాజకీయ ఉపన్యాసాల్లో దిట్టగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆందోల్‌లో దామోదర రాజనరసింహా కూతురు త్రిష ప్రచారం చేపట్టారు. ఆమె నియోజకవర్గంలో కార్యకర్తలను వెంట తీసుకుని గ్రామాలను చుట్టివస్తున్నారు. గద్వాలలో డీకే అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి కూడా ప్రచార బాట పట్టారు. టికెట్‌ ఖరారైతే తల్లిదండ్రుల తరఫున ప్రచారం చేయడం కోసం వారి కూతుళ్లు టీవీల్లో రాజకీయ ప్రసంగాలు, పత్రికల్లో వార్తలు, వ్యాసాలు చదివే పనిలో నిగ్నమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here