Home Videos

కోవ్యాగ్జిన్-కోవీ షీల్డ్ టీకాల మధ్య అసలు తేడా ఇదే

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా పాజిటివ్ వస్తోందా..అసలు ఏ వ్యాక్సిన్ మంచిది కోవ్యాగ్జిన్-కోవీ షీల్డ్ వీటిలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్న మీమాంస. ఒక వ్యాక్సిన్ 81 శాతం సేఫ్ అంటే.. మరొకటి 78 శాతం సేఫ్ అంటూ పలు లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో అసలు ఇండియాలో వినియోగంలో ఉన్న రెండు టీకాల్లో ఏది బెస్ట్ అనే సంశయం నెలకొంది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరం సంస్థ తయారు చేస్తున్న కోవిషీల్డ్ సమర్థతపై తలెత్తుతున్న అనేక విషయాల పై ఇప్పటికే ఐసీఎంఆర్ క్లారిటీ ఇచ్చింది. ఏ వ్యాక్సిన్ తీసుకున్న ఎలాంటి ప్రమాదం ఉండదు కాకపోతే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ లు తలనొప్పి,జ్వరం వచ్చినా పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here