Home Entertainment Cinema

విజయ్ దేవరకొండ దర్శకుడితో మహేష్ బాబు సినిమా..

మహేష్ బాబు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. నిన్నటి వరకు వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నది కాస్తా ఇప్పుడు ఆగిపోయింది. ఈ చిత్రంపై మనసు మార్చుకున్నాడు సూపర్ స్టార్. దాంతో వంశీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఈయన చిరంజీవితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూడా ప్రస్తుతం మరో దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిపోయాడు. ఆయన మరెవరో కాదు గీతగోవిందం ఫేమ్ పరుశురామ్. చరిత్రలో నిలిచిపోయే లాభాలు తీసుకొచ్చిన సినిమాను డైరెక్ట్ చేసి రెండేళ్లుగా మరో సినిమాను పట్టాలెక్కించడంలో విఫలమయ్యాడు పరుశురామ్.

అసలు గీతగోవిందం తర్వాత ఈయన కోసం హీరోలు పోటీ పడతారేమో అనుకుంటే అసలు ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ మధ్యే నాగ చైతన్యతో సినిమా కమిటైనా కూడా అది లేట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ లోపు మహేష్ బాబు సినిమా వర్కవుట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ లో ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. ఈ కాంబినేషన్ గురించి రెండేళ్లుగా ప్రచారం జరుగుతుంది.

గీత గోవిందం విడుదలైన తర్వాత మహేష్, పరుశురామ్ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అనుకోకుండా ఆగిపోయింది ఈ చిత్రం. కానీ ఇప్పుడు ఈ కాంబో మళ్లీ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా వంశీ పైడిపల్లిని కాదని.. ఇప్పుడు పరుశురామ్ తో సినిమా చేస్తుండటంతో మహేష్ సినిమా అంటేనే భయపడుతున్నారు దర్శకులు. ఎప్పుడు ఎవరికి హ్యాండిస్తాడో అర్థం కావడం లేదని. ఇంతకుముందు సుకుమార్ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here