Home Entertainment Cinema

మహేష్ బాబు సంచలన నిర్ణయం.. వంశీ పైడిపల్లికి షాక్..

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు సూపర్ స్టార్. రెండు నెలలుగా ఎలాంటి సినిమాలు చేయడం లేదు.. కుటుంబంతో పాటు దేశాలు తిరుగుతున్నాడు. మరో రెండు నెలల వరకు కూడా మహేష్ పూర్తిగా రెస్ట్ మోడ్ లోనే ఉండబోతున్నాడు. అయితే ఇప్పటికే తర్వాత సినిమాను అనౌన్స్ చేసాడు కాబట్టి టెన్షన్ లేదనుకున్నారు ఫ్యాన్స్. వంశీ పైడిపల్లితో ఈయన సినిమా మే నుంచి సెట్స్ పైకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు.. ఆ దర్శకుడికి మహేష్ బాబు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉన్నట్లుండి వంశీ సినిమాను మహేష్ హోల్డ్ లో పెట్టేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇతర దర్శకుడు చెప్పిన కథకు ఈయన పడిపోయాడా.. లేదంటే నిజంగానే వంశీ సినిమాలో ఏదైనా లోపాలున్నాయా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఒక్కటైతే కన్ఫర్మ్.. వంశీ పైడిపల్లి సినిమా మాత్రం అనుకున్న సమాయానికి మొదలు కావడం లేదు. ఈ కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా మహేష్ సూచించడంతో వంశీ పైడిపల్లికి షాక్ తగిలినట్లు తెలుస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండబోయే ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు సూపర్ స్టార్. ఒకటి గ్యాంగ్ స్టర్ అని కూడా తెలుస్తుంది.

మరొకటి బిజినెస్ మ్యాన్. ఇలాంటి సమయంలో రెండు పాత్రలపై మరోసారి కూర్చోవాలని వంశీకి మహేష్ చెప్పినట్లు తెలుస్తుంది. కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ పక్కా కథతోనే రావాలని చూస్తున్నాడు మహేష్. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న మహేష్ బాబు.. ఆ దూకుడు తప్పకూడదని చూస్తున్నాడు. అందుకే వంశీకి కావాల్సినంత టైమ్ ఇచ్చాడు. ఎలాగూ సంక్రాంతికి రాజమౌళి RRR వస్తుంది కాబట్టి సమ్మర్ వరకు నో టెన్షన్. అందుకే కావాల్సినంత సమయం తీసుకుని కథ రాసుకోవాలని ఈ దర్శకుడికి చెప్పేస్తున్నాడు మహేష్ బాబు. అందుకే అనుకున్న దానికంటే ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here