Home Entertainment Cinema

యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్న మహేష్ బాబు మైండ్ బ్లాక్ వీడియో సాంగ్..

సరిలేరు నీకెవ్వరు థియేటర్ లలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మహేష్ బాబు తనపై పెట్టిన నమ్మకాన్ని అనిల్ రావిపూడి నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు. ఇక ఇందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినిమా విడుదలకు ముందు దేవి శ్రీ ప్రసాద్ పాటలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ విడుదలైన తర్వాత విజువలైజేషన్ చూసి ఫిదా అయిపోయారు అభిమానులు. ముఖ్యంగా ఇందులో మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ అయితే సంచలనం సృష్టించింది.

నేనొక్కడినే సినిమా తర్వాత డ్యాన్సులు చేయడం పూర్తిగా ఆపేసిన మహేష్ బాబు.. ఆరేళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరులో మరోసారి స్టెప్పులు వేశాడు. దానికితోడు ఇప్పటివరకు ఈయన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఒక్క పాట కూడా చేయలేదు. అన్నింటికి మించి లుంగీ కట్టి.. జుబ్బా తొడిగి పక్కా మాస్ లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అనిల్ రావిపూడి మహేష్ బాబుతో అన్నీ చేయించాడు. దాంతో ఈ మైండ్ బ్లాక్ వీడియో సాంగ్ పై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా విడుదలై 50 రోజులు దాటిన సందర్భంగా ఈ పాటను యూ ట్యూబ్ లో విడుదల చేశారు చిత్రయూనిట్. విడుదలైన క్షణం నుంచి మైండ్ బ్లాక్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తుంది.

ఇప్పటికే 7 మిలియన్ల మంది ఈ పాటని చూశారు. మరొక్క రోజులో కోటి వ్యూస్ కూడా అందుకోబోతుంది మైండ్ బ్లాక్ సాంగ్. మహేష్ బాబు డాన్సులు.. రష్మిక మందన గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. యూట్యూబ్ లో ఇప్పటికీ నెంబర్ 2 ట్రెండింగ్ లో ఉంది ఈ పాట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు ఆయన మహేష్ బాబుకు ఏ సినిమాలో కూడా డాన్సులు నేర్పించలేదు. కానీ సరిలేరు నీకెవ్వరులో తమన్నా సాంగ్ తో పాటు మైండ్ బ్లాక్ సాంగ్ కూడా ఈయనే చేశాడు. రెండింటికీ మహేష్ తో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు శేఖర్ మాస్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here