Home Entertainment Cinema

మహేష్ బాబు రాబోయే 5 సినిమాలు ఈ దర్శకులతోనే..?

తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోలలో ముందు ఎన్టీఆర్ ఉంటే.. తర్వాత మహేష్ బాబు ఉన్నాడు. ఈ ఇద్దరూ వరస విజయాలతో రచ్చ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ కూడా పూర్తి చేసాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో అంతా అగ్ర దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్.. మే నుంచి కొత్త సినిమా మొదలు పెట్టనున్నాడు. MB27 పేరుతో ఇప్పటికే ట్రెండ్ అవుతుంది. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయ్యింది.

మే నుంచి షూటింగ్ మొదలు కానుంది. సంక్రాంతికి అనుకుంటున్నారు కానీ వంశీ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తాడనే పేరుంది. అందుకే సినిమా 2021 సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొన్ని నెలల సమయం తీసుకుని MB28 కోసం త్రివిక్రమ్ లైన్ లో ఉన్నాడు. ఈయన ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే ఎన్టీఆర్ కోసం కథ సిద్దం చేస్తున్నాడు. దీనితర్వాత మహేష్ లైన్ లోకి రానున్నాడు. ఇప్పటికే ఈయనతో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసాడు మాటల మంత్రికుడు. సరిలేరు నీకెవ్వరుతో మంచి విజయం అందించిన కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడితో మరోసారి వర్క్ చేయాలనుకుంటున్నాడు సూపర్ స్టార్. అందుకే కథ కూడా సిద్ధం చేయమని చెప్పేసాడు. ప్రస్తుతం అనిల్ ఎఫ్ 3 కథను సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే మళ్లీ మహేష్ బాబు సినిమాను తెరకెక్కించే అవకాశం అందుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇక వీళ్ళందరితో పాటు కెజియఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ కూడా మహేష్ బాబు కోసం ప్యాన్ ఇండియా కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. సుకుమార్ కూడా మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఈయన కూడా ఓ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి గతేడాది ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది కానీ అనుకోని కారణాలతో సినిమా నుంచి బయటికి వచ్చేసాడు సూపర్ స్టార్. ఇప్పుడు మరోసారి ఆయనతో వర్క్ చేయాలనుకుంటున్నాడు. మొత్తానికి మరో నాలుగేళ్ళ వరకు దర్శకులను సెట్ చేసుకున్నాడు ఈయన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here