Home Entertainment Cinema

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు అతిథి అవుతున్నాడా..?

అసలే ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు బాగానే వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ మాదిరే మన హీరోలు కూడా కథ నచ్చితే కలిసి నటిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లే కలిసి నటించినపుడు మిగిలిన హీరోలు కూడా తక్కువేం తినలేదు. కథ నచ్చిందంటే చాలు అందులో అంతా కలిసిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఎఫ్3లో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం కోసం ఆయన రెండు వారాలు డేట్స్ కూడా ఇచ్చాడు. అనిల్ రావిపూడిపై ఉన్న నమ్మకంతో ఈయన ఈ కారెక్టర్ చేయబోతున్నాడని తెలుస్తుంది.

Chiranjeevi and Mahesh Babu
Chiranjeevi and Mahesh Babu

అంతలోనే ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా మహేష్ నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. గత కొన్ని రోజులుగా అక్కడే నాన్ స్టాప్ షెడ్యూల్ జరుపుతున్నాడు దర్శకుడు కొరటాల. తాజాగా ఈ చిత్ర షూటింగ్ వీడియో కూడా లీక్ అయింది. నెట్ లో చిరు లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో పృథ్వీ కారెక్టర్ మాదిరే ఇందులో కనిపిస్తున్నాడు అన్నయ్య.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. కొరటాల శివతో మహేష్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనకు శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి రెండు హిట్ సినిమాలు ఇచ్చాడు. ఆ అభిమానంతోనే ఇప్పుడు చిరు సినిమాలో మహేష్ అతిథి పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. దీనిపై ఇప్పుడు కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా త్వరలోనే సూపర్ స్టార్ షూటింగ్ కు వస్తాడని తెలుస్తుంది. ఏదేమైనా కూడా సూపర్ స్టార్, మెగాస్టార్ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగే ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here