Home Entertainment Cinema

F3 సినిమాలో మహేష్ బాబు ఎంత సేపు ఉంటాడో తెలుసా..

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ మరింత పెరిగిపోయింది. వరుసగా ఐదు విజయాలు సాధించడంతో ఈ కుర్ర దర్శకుడి కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తున్నారు. రొటీన్ కథలను కమర్షియల్ కోణంలో తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి ఆరితేరిపోయాడు. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది. ఒకటి రెండు కాదు ఏకంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నిర్మాత దిల్ రాజుకు దాదాపు 50 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. అలాంటి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు కాలం కలిసి రాదు.

Mahesh in f3
Mahesh Babu to act in F3 Venkatesh Varun Sandesh : Anil Ravipudi Film

ఇప్పటి వరకు ఒక్క సీక్వెల్ కూడా హిట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి మాత్రం చరిత్ర తిరగరాస్తా అంటున్నాడు. ఎఫ్ 3 లో కూడా వెంకటేష్ వరుణ్ తేజ్ వాళ్ల వాళ్ల పాత్రల్లో కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో మరో స్టార్ అట్రాక్షన్ కూడా ఉంది. అదే మహేష్ బాబు గెస్ట్ అప్పియరెన్స్.. అతిథి పాత్ర అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాదు. ఈయన సెకండ్ హాఫ్ లో అరగంట పాటు కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం 14 రోజులు డేట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. తనకు సరిలేరు నీకెవ్వరు లాంటి విజయం ఇచ్చిన దర్శకుడు కావడంతో అనిల్ రావిపూడి అడగగానే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు మహేష్.

దాంతోపాటు వెంకటేష్ అంటే తనకు చాలా ఇష్టమని మహేష్ చాలా సార్లు చెప్పాడు. ఆయన కూడా సినిమాలో ఉన్నాడు కాబట్టి ఎఫ్ 3 లో మహేష్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈయన పాత్ర సినిమాను మలుపుతిప్పే విధంగా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ముందు అనుకున్న కూడా రాజమౌళి ఉండటంతో సమ్మర్ కు పోస్ట్ ఫోన్ చేసుకునే ఆలోచనలో కనిపిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఏదో మీద కూడా కెరీర్ లో ఫస్ట్ టైమ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు సూపర్ స్టార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here