Home Entertainment Now Showing

సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ 70 కోట్ల సంపాదన..

ఒక్క సినిమాతో 70 కోట్లు సంపాదించటం అంటే చిన్న విషయం కాదు. బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇది సాధ్యం చేసి చూపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి ఈయన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు రెమ్యూనరేషన్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అయితే ముందు నుంచి సరిలేరు నీకెవ్వరుపై చాలా అంచనాలు పెట్టుకున్న మహేష్ బాబు ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించాడు.

దిల్ రాజు అనిల్ సుంకరతో కలిసి తాను కూడా ఈ సినిమాను నిర్మించాడు సూపర్ స్టార్. అలా లాభాల్లో వాటా తీసుకున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాకు దాదాపు 30 కోట్లు రెమ్యూనరేషన్‌గా మహేష్ బాబు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగా పారితోషికం అందుకున్న సూపర్ స్టార్.. వరుస విజయాలు వస్తుండటంతో మరో 10 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసాడని తెలుస్తోంది. అందుకే సరిలేరు నీకెవ్వరూ కోసం దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించిన అతడు.. 42 కోట్ల వరకు లాభపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో మొత్తంగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా నిర్మాతగా, హీరోగా కలిపి 72 కోట్లు సంపాదించాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇస్తే కానీ నిజమైతే మహేష్ బాబు పంట పండినట్లే. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో సినిమా కమిట్ అయ్యాడు. మే నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. విశాఖ కేంద్రంగా వ్యాపారాలు చేసుకునే ఒక బిజినెస్ మాన్ పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నాడని.. మరొకటి గ్యాంగ్ స్టర్ పాత్ర అని తెలుస్తోంది. దీనికి కూడా భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు మహేష్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here