Home Entertainment Cinema

కరోనా సమయంలో స్పీడ్ పెంచుతోన్న మహేశ్ బాబు..ఒకేసారి రెండు సినిమాలు

మహేశ్ బాబు గురించి టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌ న్యూస్ వినిపిస్తోంది. ఈ వార్తవిని సినీజనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహేశ్‌లో ఇంత మార్పా.. ఈ సడన్‌ చేంజెస్‌కి కారణమేంటి.. అసలు ప్రిన్స్‌ ఈ కొత్త నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి అని చర్చలు పెడుతున్నారు. మహేశ్ బాబు చాలా స్లోగా సినిమాలు చేస్తాడని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఒక కథని ఓకే చెయ్యడానికి ఎంత టైమ్ తీసుకుంటాడో, షూటింగ్‌ పూర్తి చెయ్యడానికి కూడా అంతే టైమ్‌ తీసుకుంటాడనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడీ ప్రచారానికి బ్రేకులేస్తూ, ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చెయ్యాలనుకుంటున్నాడట మహేశ్

మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ చేస్తున్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌తో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా అనౌన్స్‌ చేశాడు మహేశ్. 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్‌తోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చాలాకాలం తర్వాత సినిమా చేస్తోన్నా, ఈ మూవీని చాలా స్పీడ్‌గా ఫినిష్ చెయ్యాలనుకుంటున్నాడట మహేశ్. ‘సర్కారువారిపాట’తో పాటు ఈ మూవీ షూటింగ్‌ని కూడా సైమల్టేనియస్‌గా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడట. సో పెద్దగా గ్యాప్‌ లేకుండానే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here