మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మధ్యలో అనవసరంగా ఫేక్ రికార్డులు వేసి సినిమా రేంజ్ తగ్గించేసారు కానీ లేదంటే మాత్రం నిజంగానే సూపర్ హిట్ అయింది సరిలేరు నీకెవ్వరు. ఇంటా బయట మంచి వసూళ్లు సాధించింది. రొటీన్ కథ.. అదే స్క్రీన్ ప్లే అంటూ టాక్ వినిపించినా కూడా మహేష్ తన ఇమేజ్ తో సినిమాను నడిపించాడు.

ఇప్పటి వరకు మూడు వారాల్లో ఈ చిత్రం ఏకంగా 127 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు ఇన్ని వసూళ్లు తీసుకొచ్చిన సినిమా ఏదీ లేదు. 100 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 127 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 107 కోట్లు వసూలు చేసి సైరా రికార్డులను కూడా తుడిచేసాడు మహేష్ బాబు. సైరా 104 కోట్ల షేర్ వసూలు చేసింది.. ఇక అల వైకుంఠపురములో మాత్రం 120 కోట్ల షేర్ వసూలు చేసి బాహుబలి 2 తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుంది. మూడో స్థానంలో 110 కోట్లతో బాహుబలి ఉండగా.. నాలుగో స్థానంలో 107 కోట్లతో సరిలేరు ఉంది.
- వచ్చే ఎన్నికల కోసం సిట్టింగ్ లకు ఎర్త్ పెడుతున్న టీఆర్ఎస్ నేతలు వీరే…!
- అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి.. ఆ పై బెదిరింపులు..కడపలో ఏంజరుగుతుంది…?
- టీఆర్ఎస్ లో మరో ఎమ్మెల్యేకి కౌంట్ డౌన్ స్టార్ట్…!
- కేబినెట్ బెర్త్ పై గురిపెట్టిన వైసీపీ సీనియర్లు..వీరిలో చాన్స్ ఎవరికో..?
- ఆ సీనియర్లందరిని పక్కన పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్..రేవంత్ కి ఫుల్ పవర్స్
ఓవర్సీస్ తో పాటు అన్నిచోట్లా కలుపుకుంటే ఈ చిత్రం 127 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకున్న సరిలేరు విదేశాల్లో మాత్రం యావరేజ్ దగ్గరే ఆగింది. అక్కడ కోటి 50 లక్షల నష్టం తీసుకొచ్చింది ఈ చిత్రం. 2.2 మిలియన్ వసూలు చేసినా కూడా చేసిన బిజినెస్ మాత్రం ఎక్కువే ఉండటంతో అక్కడి బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. అక్కడ తప్ప అన్నిచోట్లా సరిలేరు సంచలన విజయం సాధించింది. మొత్తానికి భరత్ అనే నేను, మహర్షి సినిమాల తర్వాత సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు సూపర్ స్టార్. జూన్ నుంచి వంశీ పైడిపల్లి సినిమాతో బిజీ కానున్నాడు మహేష్ బాబు.