Home Entertainment Cinema

పెళ్లి కొడుకు అయిన కుర్ర హీరో.. సైలెంట్‌గా మ్యారేజ్..

ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. వరసగా అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేస్తున్నారు. తాజాగా తమిళ హీరో మహత్ రాఘవేంద్ర కూడా పెళ్ళి చేసుకున్నాడు. గతేడాదే ఈయన నిశ్చితార్థం జరిగింది. ప్రేయసి ప్రాచి మిశ్రాను ఈయన వివాహం చేసుకున్నాడు. తమిళంలో మంగత్తా, జిల్లా సహా 20 సినిమాలకు పైగానే నటించాడు మహత్. తెలుగులో కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్, లేడీస్ అండ్ జెంటిల్ మెన్ లాంటి సినిమాలు చేసాడు. అయితే ఇక్కడ గుర్తింపు రాలేదు. కానీ తమిళనాట మాత్రం హీరోగా కూడా నటించాడు మహత్. అక్కడ మనోడికి మంచి ఇమేజ్ ఉంది.. గుర్తింపు కూడా ఉంది.

కారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంటాడు మహత్. ఈయన పెళ్లి ఎలాంటి సందడి లేకుండా తమిళనాడులోని ఓ బీచ్ సమీపంలో జరిగింది. ప్రాచీ మిశ్రాతో కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నాడు మహత్. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పి నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా చేసుకున్నాడు. అయితే పెళ్లి మాత్రం తెలియకుండానే..

తమిళనాట ఎవర్నీ పిలవకుండానే చేసుకున్నాడు ఈయన. మహత్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చూసి అంతా షాక్ అవుతున్నారు. శింబు, అనిరుధ్ లాంటి ఒకరిద్దరు తన స్నేహితులను తప్ప మరెవర్ని పెళ్లికి ఆహ్వానించలేదు ఈయన. పెళ్ళి సైలెంట్ గా చేసుకున్నా.. రిసెప్షన్ మాత్రం చాలా ఘనంగా ప్లాన్ చేస్తున్నాడు ఈయన. దీనికి ఇండస్ట్రీలోని ప్రముఖులంతా వస్తారని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here