Home News

ప్రజలను నన్ను అర్ధం చేసుకోకుండా నష్టపోయారు..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ మాహానాడులో భాగంగా ఎన్ఆర్ఐలతో జరిగిన ఆన్ లైన్ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనను అర్థం చేసుకోలేకపోయారని వారికోసం చాలా కష్టపడ్డా అన్నారు. ప్రజలు తనను అర్థం చేసుకోకపోవడం వల్ల తనకు నష్టం రాలేదని, ప్రజలే నష్టపోయారని చెప్పారు. నేను చేసిన తప్పేంటో అర్ధం కావడం లేదన్నారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పలువురు ఎన్‌ఆర్‌ఐలతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.

అవినీతి చేసిన వ్యక్తిని నమ్మిన ప్రజలు నేను చేసిన మంచిని అర్దం చేసుకోలేదన్నారు. తనను మారాలంటున్నారని, కానీ దానికి ముందు నిలబడి ఉండాలి కదా అని నిర్వేదం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా గెలుస్తుందని ఇందులో అనుమానం అవసరం లేదన్నారు. ఎన్నికలు ముందు జరిగినా గెలుస్తామని చెప్పారు. 2లక్షల కోట్ల సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here