Home Entertainment Cinema

హీట్‌ పుట్టిస్తున్న మా ఎన్నికలు..నడిగర్‌ సంఘంలో లోకల్‌-నాన్‌లోకల్‌ రచ్చ

సాధారణంగానే తెలుగు రాష్ట్రాల్లో జరిగే రాజకీయాల కంటే..మా ఎన్నికల్లోనే ఎక్కువ పాలిటిక్స్‌ నడుస్తుంటాయి. వివాదాలు, ఆరోపణలు మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో నిత్యకృత్యం. గత పదేళ్ల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వెళ్లదీశారే తప్పా.. మా బాగోగులు పట్టించుకోలేదన్నది చాలా మంది నుంచి వస్తున్న విమర్శ. ఇలాంటి సమయంలో త్వరలో జరగనున్న మా ఎన్నికలు మరోసారి హీట్‌ పుట్టిస్తున్నాయి.

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల్లో లోకల్‌-నాన్‌లోకల్‌ అంశం తెరపైకి వచ్చి నడిగర్‌ సంఘంలో చిచ్చు రేపిన వివాదమే.. మా ఎన్నికల్లోనూ మంట పుట్టిస్తుంది. మా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకాష్‌ రాజ్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు చిరంజీవి, నాగబాబు సహా మరికొంత మంది హీరోల మద్దుతు ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఇంకేముంది ప్రకాష్‌రాజ్‌..ఏకగ్రీవం కావడం ఖాయమనుకున్నారంత. కానీ అనుహ్యంగా మంచు విష్ణు బరిలోకి దిగారు. తానూ పోటీలో ఉన్నానంటూ ప్రకటించేశారు. ముందుగా జీవితా రాజశేఖర్‌ తెరపైకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా విష్టు ఎంట్రీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మా ఎన్నికల్లో లోకల్‌-నాన్‌లోకల్‌ అన్న అంశం తెరపైకి రాబోతోంది. ప్రకాష్‌రాజ్‌ కర్నాటకకు చెందిన వ్యక్తిని.. ఆయన్ని మా..కు అధ్యక్షున్ని చేసి మా మీద రుద్దుతారా అన్న వాదన వినిపిస్తోంది. స్థానికున్నే మా అధ్యక్షుడిగా ఎన్నికోవాలన్న అభిప్రాయాన్ని కొందరు తెరమీదకు తెస్తున్నారు. ఇదే అంశంపై గతంలో నడిగర్‌ సంఘంలో జరిగిన రచ్చ అంత ఇంతా కాదు. ఒక తెలుగు వాడికి నడిగర్‌ సంఘం పీఠాన్ని ఎలా అప్పగిస్తారంటూ అప్పట్లో విశాల్‌ను ఓ తమిళ వర్గం టార్గెట్‌ చేసింది. విశాల్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. అతన్ని అడ్డుకునేందుకు నానా యాగీ చేసింది. ఇదే వివాదం.. ఇప్పుడు మా ఎన్నికల్లోనూ రిపీట్‌ అవుతుందా అన్న చర్చ మొదలైంది. మంచు విష్ణు రంగంలోకి దిగడంతో మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్ ఎన్నికల్లో హరాహోరీ తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here