Home News Updates

‘మా’ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య వార్‌ పీక్‌ స్టేజ్‌కు వెళ్లిందా ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఆర్టిస్ట్‌ల సమస్యలపై దృష్టి పెట్టకుండా..వ్యక్తిగత విమర్శలకు దిగే స్థాయికి వెళ్లింది. సినిమాల్లో నటించినపుడు గుర్తుకు రాని..అంశాలు ఎన్నికల వేళ గుర్తుకు వస్తున్నాయి. సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, సక్సెస్‌ మీట్స్‌, విజయయాత్రల సమయంలో…పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తమకంటే ఎదుట వ్యక్తే అద్భుతంగా నటించాడంటూ కితాబిస్తారు. తామంతా ఒక్కటేనని…తమ కోసం అభిమానులెవరు గొడవలు పడవద్దని చెబుతారు. మా ఎన్నికలు వచ్చే సరికి…అసలు వ్యవహారంలో బయటకు వస్తోంది. నటుల మధ్య విభేదాలు వెలుగులోకి వస్తున్నాయ్.

ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని చెప్పుకునే నటులు..ఎన్నికలు వచ్చేసరికి వర్గాలుగా విడిపోతున్నారు. సహజంగానే ఒక వర్గం పోటీగా నిలబడగానే మరోవర్గం శంఖారావం పూరించడం సాధారణమైపోయింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలో చెప్పినట్లుగానే..నటులందరూ సర్దుకుపోతే ముఖ్యంగా సినిమా రంగానికి చాలా మంచిది. సినిమా రంగం వర్గాలు విడిపోయే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటే పోతే…వారికే మంచిది కాదు. ఇండస్ట్రీ అల్లరి అయితే…అది అందరి దృష్టిలో చులకన అవుతుంది. త్వరలో జరగనున్న మా ఎన్నికల్లో…లోకల్‌, నాన్‌లోకల్ అంశం పెద్ద దుమారం రేపుతోంది.

ప్రకాశ్‌ రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసరికి..ఎన్నడూ లేని విధంగా లోకల్‌, నాన్‌లోకల్‌ అనే మాటలు వినిపిస్త్తున్నాయి. కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉంటాయా ? ఒక వేళ ఉంటే…తమిళులు, కన్నడిగులు, తెలుగు నటులు…వారి మాతృబాషల సినిమాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. కళాకారులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. ఏ బాషలోనైనా నటించవచ్చు. టాలెంట్‌ ఉంటే సరిపోతుంది. ప్రకాశ్‌రాజ్‌ను అన్నట్లే ఇతర రాష్ట్ర ప్రజలు అనుకుంటే పరిస్థితి ఏంటి ? అల్లు అర్జున్‌ సినిమాలను మళయాళం ప్రజలు అదరిస్తారు. స్టైలిష్‌స్టార్‌ను మళయాళీ కాదనుకుంటే…అతనికి క్రేజ్‌ ఉండేదా అన్న చర్చ నడుస్తుంది.

చిరంజీవి, నాగార్జున హిందీ సినిమాల్లో నటించారు. హిందీ నటులు చాలా మంది తెలుగు సినిమాల్లో అడపదడపా కనిపిస్తూనే ఉన్నారు. హీరోయిన్లైతే 90 శాతం మంది ఉత్తరాదికి చెందినవారే. లోకల్‌, నాన్‌లోకల్ అన్న లెక్కలు తీస్తూ కూర్చుంటే నిర్మాతలు దర్శకులు సినిమాలు తీయగలరా కళాకారులకు బాషతో, ప్రాంతంతో సంబంధం ఉండదు. తెలంగాణలోని పాలమూరు జిల్లాలో గ్రామాలను దత్తత తీసుకున్నపుడు..ప్రకాశ్‌ రాజ్‌ ఏ ప్రాంతానికి చెందిన వాడో గుర్తుకు రాలేదా..అలాగే నటుడు సోనుసూద్‌ మరాఠీ వాసినని అనుకునే ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న వారికి సాయం చేసేవారా..సంకుచితమైన మనస్తత్వం ఉన్న వారే అలాంటి వ్యాఖ్యలు చేస్తారు తప్పా…విజ్ఞులు అలా ఎన్నటికి మాట్లాడరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here