Home News Politics

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే తప్పేంటి: తెలుగుపాపులర్ ఇంటర్వ్యూ లో జేపీ ప్రశ్న

పవన్ కళ్యాణ్ సినిమాలు మళ్ళీ చేస్తే తప్పేంటని లోక్ సత్తా వ్యవస్థాపకులు డా జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. తెలుగుపాపులర్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ జేడీ లక్ష్మీనారాయణ రాసిన రాజీనామా లేఖలోని అంశాలపై మాట్లాడారు.

అవినీతి చేయకుండా పవన్ కళ్యాణ్ సినిమా చేసుకోవడం నాకు తప్పనిపించండం లేదు అన్నారు జేపీ. రాజకీయాలు చేయడానికి చాలామంది వివిధ దారులు వెతుకుతారని , పవన్ కళ్యాణ్ అలా కాకుండా తనకు తెలిసిన సినిమా నటనపై ఆధారపడటం మంచిదన్నారు.
రాజకీయాలు నడపడం, పార్టీ నిర్వహించడం ఖర్చుతో కూడుకున్నదని ఇందుకోసం పవన్ కళ్యాణ్ నిధులకై సినిమాల్లో నటించడాని తానూ అభినందిస్తానని అన్నారు.

జయప్రకాశ్ నారాయణ మాట్లాడిన అంశాలు పూర్తి వీడియో కింద చూడండి.