Home News Politics

లోకేశ్ టీం రెడీ…సైకిల్ పార్టీలో పోటీకి సై అంటున్న వారసులెవరంటే..?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ యువనాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తుందా…?యువనేత లోకేశ్ కి కోర్ టీంని రెడీ చెయ్యాలని నారా వారు స్కెచ్ గీశారా…అంటే పసుపు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తుంది. సీనియర్ నేతల వారసులను తెర పైకి తీసుకురావడం ద్వారా పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామన్న సందేశంతో పాటు లోకేశ్ టీం కి ఈ ఎన్నికల నుంచే రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు సీఎం చంద్రబాబు.

వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీ నుంచి వారసులు పోటీకి సై అంటున్నారు. సీనియర్లతో వేగలేకపోతున్న చంద్రబాబు ఇప్పటి నుంచే కుమారుడు లోకేశ్ కి లైన్ క్లియర్ చేసే దిశగా ప్లాన్ సిద్దం చేశారు. పోటీకి చాలా మంది సై అంటున్నా ఎంత‌మందికి అధినేత చంద్ర‌బాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తార‌న్న‌దే తెలియ‌టం లేదు. కొంద‌రు సీనియ‌ర్లు వ‌యోభారం రీత్యా ఎన్నిక‌ల నుండి త‌ప్పుకుంటుంటే మ‌రికొంద‌రు అనారోగ్య కార‌ణాల వ‌ల్ల వార‌సుల‌కు లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌త్ర‌మే త‌మ‌తో పాటు త‌మ వార‌సుల‌కు కూడా టిక్కెట్లు కావాల‌ని కోరుతున్నారు. మొత్తం మీద పార్టీలో అయితే వార‌సుల గాలి బలంగా వీస్తుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుండి స్వ‌చ్చందంగా త‌ప్పుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ ఎమ్మెల్యే కెఈ కృష్ణ‌మూర్తి, శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుంద‌ర శివాజి, అనంత‌పురం ఎంపీ జేసి దివాక‌ర్ రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసి ప్ర‌భాక‌ర్ రెడ్డి, క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రి, తూర్పు గోదావ‌రి జిల్లాలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, విజ‌య‌న‌గ‌రం ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఉన్నారు. వారంతా త‌మ వార‌సుల‌కు టిక్కెట్లివ్వాలంటూ చంద్ర‌బాబుకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అదే స‌మ‌యంలో చిత్తూరు జిల్లాలోని శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, దివంగ‌త‌ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు వార‌సుల విషయంలో ఇంకా పార్టీ అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.

ఇక గుంటూరు జిల్లాలో స్పీకర్ కోడేల తన వారసులను రంగంలో దింపే పనిలో ఉన్నారు. తన కుమారుడు శివరామకృష్ణ ను నర్సరావు పేట అసెంబ్లీ నుంచి బరిలో దింపాలని చూస్తుండగా. శివరామ్ వ్యవహార శైలీ పై అధిష్టానంకు అంత మంచి ఫీడ్ బ్యాక్ లేదు. దీంతో కూతురు డాక్టర్ విజయలక్ష్మీని తెరమీదకు తెచ్చారు కోడెల. ప‌త్తికొండ నుండి కెఈ కుమారుడు శ్యాంబాబు, ప‌లాస నుండి గౌతు శిరీష‌, అనంత‌పురం ఎంపీగా జేసి ప‌వ‌న్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏగా జేసి అస్మిత్ రెడ్డి, తుని నుండి దివ్య, విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నుండి అదితి బ‌రిలోకి దిగే చాన్స్ ఉంది. రాజ‌మండ్రి నుండి తానే పోటీ చేయాల‌ని ఎంపి ముర‌ళీ మోహ‌న్ రెడీ అవుతున్నా కోడ‌లు రూప‌ను పోటీ చేయిస్తే బాగుంటుంద‌ని పార్టీ క్యాడ‌ర్ భావిస్తోంది.

అదే స‌మ‌యంలో త‌మ‌కు కూడా టిక్కెట్లు కావాలంటూ మ‌రికొంద‌రు వార‌సులు అధిష్టానానికి అర్జీలు పెట్టుకున్నారు. వారిలో దివంగత నేత దేవినేని నెహ్రు తనయుడు అవినాశ్, పరిటాల వారసుడు ప‌రిటాల శ్రీ‌రామ్, చింత‌కాయ‌ల విజ‌య్, క‌ర్నూలు అసెంబ్లీకి టిజీ భ‌ర‌త్, ప్ర‌కాశం జిల్లాలోని అద్దంకి నుండి క‌ర‌ణం వెంక‌టేష్, దర్శి నుంచి మంత్రి సిద్దారాఘవరావు కుమారుడు ఇలా లిస్ట్ చాంతాడంతా ఉంది. వీరిలో చంద్రబాబు ఎంతమందికి చాన్స్ ఇస్తారో చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here