Home News Politics

లోకేష్ కి తోడుగా తోడల్లుడు ఎంట్రీ

వారసత్వ రాజకీయాల్లో భాగంగా మరో నాయకుడు తెరమీదకు రానున్నారు. అటు వెండితెరతో పాటు ఇటు పొలిటికల్ స్క్రీన్ మీద సక్సెస్ అయిన నందమూరి ఫ్యామిలీ నుంచి మరో లీడర్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్. గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీఎస్ మూర్తి మనవడైన భరత్ రాబోయే ఎన్నికల్లో ఎంపీగా బరిలో దిగనున్నారని టాక్….తన తాత మూర్తి గతంలో ప్రాతినిధ్యం వహించిన విశాఖ పట్టణం పార్లమెంటు స్థానం నుంచి భరత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం…

గత ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ పొత్తులో భాగంగా వైజాగ్ ఎంపీగా కంభంపాటి హరిబాబు విశాఖ పార్లమెంటు నుంచి బరిలో దిగి గెలుపొందారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తులేని నేపథ్యంలో అభ్యర్థుల అన్వేషణ మొదలైందని ఇందులో భాగంగా భరత్ తెరమీదకు వచ్చారని అంటున్నారు. తన తాతకు ఉన్న రాజకీయ నేపథ్యంలో తన మామ బాలకృష్ణ కోటా రూపంలో టికెట్ సంపాదించుకునేందుకు ఈజీ కావడంతో భరత్ పోటీ చేసేందుకు సై అంటున్నట్లు చెప్తున్నారు.

తన బావమరిది వియ్యంకుడు అయిన బాలయ్య అల్లుడు అయినప్పటికీ టికెట్ ఖరారు విషయంలో చంద్రబాబుదే తుది నిర్ణయమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భరత్ ఆసక్తిని భవిష్యత్ లో చంద్రబాబు చేరవేస్తే ఆయన ఒప్పుకుంటారా? లేక నో చెప్తారా అనే దాని ఆధారంగా భరత్ ఎంట్రీ ఉండనుందని అంటున్నారు. ఇంకొద్ది కాలం గడిస్తే కానీ..లోకేష్ కి తోడుగా తోడల్లుడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందో లేదో పూర్తి క్లారిటీ రాదని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here