Home News

తెలంగాణలో మరో పదిరోజుల పాటు లాక్ డౌన్ పొడిగింపు..మరిన్ని సడలింపులు

తెలంగాణలో లాక్‌డౌన్‌ మరో పదిరోజులు పొడిగించింది రాష్ట్రప్రభుత్వం. సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌లో సడలింపు సమయాన్ని మరింత పెంచింది ప్రభుత్వం. ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఆంక్షల నుంచి సండలింపు ఇచ్చింది. అయితే సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరింటి వరకు కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఈ కొత్త లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

కరోనా అదుపులోకి రాని నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో వానాకాలం పంటలు, సాగునీటి అంశాల పై కేబినెట్ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ విషయంపైనా సమావేశంలో చర్చించారు. దీంతో పాటు పీఆర్సీ,కొత్త రేషన్ కార్డులు ఇతర అంశాల పై చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here