Home News Updates

తిరుమలకు లైట్ మెట్రో

తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేయడానికి లైట్ మెట్రో మార్గం మంచిదని టి టి డి భావిస్తోంది . యాత్రికుల రద్దీ దృష్ట్యా ఇదీ మంచిదని ఆలోచిస్తోంది . దీని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి తో హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో భేటీ అయ్యి చర్చించారు .

యాత్రికుల రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహనా లు అయితే బావుంటుందని హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తిరుమల శ్రీ పద్మావతీ అతిథి గృహంలో వై వి సుబ్బారెడ్డి గారితో అయన భేటీ అయ్యారు. తిరుపతి లోను ., తిరుమలలోనూ ట్రాఫిక్ ను తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ప్రజా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు చర్చకు వచాయి. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి కూడా చర్చించారని తెలిసింది.

తిరుపతి నుంచి తిరుమలకు రోప్ వే వేయాలని గతంలో ప్రతిపాదనలు వున్నాయి . అయితే ఇది కూడా సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. ఇప్పుడు లైట్ మెట్రో ఎంతవరకు అనువైనదో తేలాల్సి వుంది.