Home Entertainment Cinema

ఆర్జీవి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌…ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త టెన్షన్…!

వ‌ర్మ ముందే హెచ్చ‌రించారు. హెచ్చరించిన స్థాయిలోనే ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులను బాధించేలా చ‌రిత్ర‌లో జ‌రిగిన స‌న్నివేశాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు. ఈ ట్రైల‌ర్ నిజంగానే ఎన్టీఆర్ అభిమానుల‌ను ఏడిపిస్తోందా. లేక చంద్రబాబు అభిమానులకు బాధని మిగులుస్తుందా… దీనిపై ఇప్పుడు టీడీపీ లోనూ టెన్ష‌న్ మొద‌లైంది. వైశ్రాయ్ ఎపిసోడ్ ను ట్రైల‌ర్ లో హైలైట్ చేసిన వ‌ర్మ‌..ఇక సినిమా లో ఎలా చూపించారో అనేది ఇప్పుడు అస‌లైన ఉత్కంఠ‌.. దీనికి తోడు ట్రైల‌ర్ లో నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక త‌ప్పు వాడిని న‌మ్మ‌డం అంటూ చేసిన చెప్పిన డైలాగ్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది..

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్… నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్‌ నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం అంటూ ముగుస్తుంది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లోనే వ‌ర్మ చూపించే ప్ర‌య‌త్నం చేసారు.

ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ కు ముందే వ‌ర్మ ఆస‌క్తి క‌ర ట్వీట్లు చేసారు. ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. రేపు మీ ముందుకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రైలర్‌ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్లకి నేను బాధ్యుడిని కాదు అంటూ వర్మ ట్వీట్ చేసారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సిని మా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వైశ్రాయ్ ఎపిడోస్ లో ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన సీన్ చూసిన త‌రువా ప్ర‌తీ ఎన్టీఆర్ అభిమాని క‌న్నీళ్లు పెట్టాల్సిందే..

ఇక ఈ ట్రైల‌ర్ లో ఆర్జీవి ప్ర‌ధానంగా ఎన్టీఆర్ -ల‌క్ష్మీ పార్వ‌తి ఎపిసోడ్ లో బ్యాక్ గ్రౌండ్ డైలాగులు కొన్ని చేర్చారు. దీనికి కొన‌సాగింపుగా ఎన్టీఆర్ పాత్ర క‌న్నీళ్లు కార్చ‌టం..చివ‌ర్లో నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం అంటూ చెప్పిన డైలాగ్ ప‌ర‌మార్ధం పై టిడిపిలో క‌ల‌వ‌రం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా తొలి పాట పై టీడీపీ నేత‌లు కోర్టుకెక్కారు. బాల‌కృష్ణ తీసిన క‌ధానాయ‌కుడు అంత స‌క్సెస్ కాక‌వ‌పోటం..ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌..ఈ సినిమా విడుద‌ల కావ‌టంతో ఎన్టీఆర్ అభిమానులు ఒక ర‌క‌మైన భావోద్వేగానికి గురి కావ‌టం కూడా టీడీపీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ కు కార‌ణ‌మ‌వుతోంది.

అధికార పార్టీలో ఎక్కువగా ఎన్టీఆర్ వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ మరణంకు కొన్ని రోజుల ముందు పడ్డ అత్యంత బాధకర సంఘటనలు చూపించాడు. ట్రైలర్ లోనే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ ను కుటుంబ సభ్యులు ఆడుకున్నారో చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. ట్రైలర్ లోనే ఈ స్థాయిలో చూపించిన వర్మ ఇక పూర్తి సినిమాలో ఎన్టీఆర్ పడ్డ మానసిక వేదనను సంపూర్తిగా చూపడం ఖాయం. మొత్తానికి వర్మ తీసిన మూవీతో రాజకీయ కల్లోలం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.