Home Entertainment Cinema

కూతురు లవ్ మ్యారేజ్ కి వెంకి గ్రీన్ సిగ్నల్….

ఇండస్ట్రీలో మరో ప్రేమ పెళ్ళికి బాజా మోగింది. సినీ ఇండస్ట్రీలో పేరున్న దగ్గుబాటి కుటుంబంలో ప్రేమ కథ పెళ్లిపీటలెక్కనుంది. విక్టరీ వెంకటేశ్ గారాలపట్టి ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వీరి పెళ్ళికి పెద్దలు కూడా అంగీకారం తెలిపారని సమాచారం. సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ల వైపు మొగ్గు చూపడం దానికి పెద్దలు అంగీకరించడం కామన్ గా జరుగుతుంది.

వెంకీకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. తన ఫ్యామిలీని పెద్దగా బయట ప్రపంచానికి పరిచయం చేసింది లేదు. ఎలాంటి సినిమా ఫంక్షన్లలో కాని ఈవెంట్లలో కాని పాల్గొన్నది లేదు. ఒక కూతురు హావ్యా స్పోర్ట్స్ రంగం(బ్యాడ్మింటన్) వైపు దృష్టిసారించగా మరో కూతురు అశ్రిత ప్రొఫెషనల్ బేకర్. బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకున్నారు. `ఇన్ ఫినిటీ ప్లేటర్` పేరుతో హైదరాబాద్ నగరంలో పలు స్టాల్స్ ని నిర్వహిస్తున్నారు.


ఇప్పటి వరకూ వెంకీ చూపించింది లేదు. వెంకీకి ఒక కుమారుడు అర్జున్, కూతురు ఆశ్రిత ఉన్నారు. కూతురు ఆశ్రిత ఆమె ఓ ప్రముఖుడి కుమారుడిని ప్రేమించిందని తెలుస్తోంది. వారిద్దరి మధ్య చదువుకునే రోజుల నుంచి స్నేహం ఉందట. అది కాస్తా ప్రేమగా అనంతరం పెళ్లిగా మారినట్టు తెలుస్తోంది. ఆశ్రిత ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల తన అన్న సురేష్ బాబుతో చర్చించిన వెంకీ.. కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఘనంగా నిశ్చితార్థ వేడుక కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. వెంకీ కుమార్తె అశ్రిత గత కొంతకాలంగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వీరి మధ్య చదువుకునే రోజులు నుంచే స్నేహం ఉందట,ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తుంది.

అశ్రిత ప్రేమించింది హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని అని తెలుస్తోంది. ఇక అటు పెళ్లి కుమారుడు ఫ్యామిలీకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకుని వీరిద్దరు పెద్దలకు ఈ విషయాన్ని చెప్పేశారు. వెంకటేష్‌ సోదరుడు నిర్మాత డి.సురేష్ బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి పెళ్లి పై మాట్లాడినట్టు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here