Home Entertainment Cinema

గ్రీన్ ఇండియా.. రోజా తోటలో పూసిన ఖుష్బూ మొక్కలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫిబ్రవరి 29న ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో రోజా వనం ఫౌండర్ రోజా, అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్న రోజా గారికి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు ఎంపీ సంతోష్ గారిని కుష్బూ ప్రత్యేకంగా అభినందించారు. మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితో పాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం.

ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిని మనం ఎంత విరివిగా పెంచితే అంత మంచిది అని తెలిపారు. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ 10 నిమిషాలు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ ని దేవుడు అంటాం. మరి అలాంటప్పుడు మనకు జీవితం మొత్తం ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను ఇంకెంత జాగ్రత్తగా, బాధ్యతగా పెంచాలి.. ఆ బాద్యతను ఇప్పుడు మనం తీసుకుందామంటూ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తన అమూల్యమైన సమయాన్నీ ప్రజల శ్రేయస్సు కోసం, వారికి అవగాహన కల్పించాలని ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న కుష్బూ, సహకారాన్ని అందించిన రోజాని ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here