Home News Politics

కురుపాంలో శ్రీవాణికి డబుల్ సవాల్…!

ఈ నియోజకవర్గంలో గెలుపు ఫ్యాన్ పార్టీకి నల్లేరు మీద నడకే కానీ రాజకీయాలు శరవేగంగా మారుతుండటంతో కురుపాంలో రాజకీయం రసవత్తరంగా మారింది.ఇక్కడ ఎమ్మెల్యే విజయానికి కుటుంబ బంధాలే అడ్డంకిగా మారాయి.ఒక కుటుంబంలో ఏర్పడ్డ ఆధిపత్య పోరాటమే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెనుకబడి పోవడానికి కారణమని చెప్పకతప్పదు. తటస్థంగా ఉన్న నేతలు సైకిల్ పార్టీకి చేరువ అవుతుండటంతో గన్ షాట్ గా గెలుస్తామనుకున్న నియోజకవర్గంలో వైసీపీకి నీలిమేఘాలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మారుతున్న సమీకరణల పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

కురుపాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. 2009 పునర్విభజనలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మరియు గరుగుబిల్లి మండలాలతో కొత్తగా నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి జనార్ధన్ దాట్రాజ్ ప్రజారాజ్యం అభ్యర్ధి నిమ్మక జయరాజు పై విజయం సాదించారు. రాష్ట్రంలో మారిన రాజకీయపరిణామాలతో శత్రుచర్ల,జనార్ధన్ దాట్రాజ్ టీడీపీలో చేరారు.కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గెలిచినప్పటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్నారు. జగన్ వెంటే నడుస్తానని చెప్పారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు కూడా ఆమె లొంగలేదు. దీంతో పాదయాత్ర సందర్భంగా జగన్ పుష్ప శ్రీవాణిని ఆకాశనికెత్తారు. గత ఎన్నికల్లో దాదాపు 19 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్ పై గెలుపొందారు.

ప్రజల్లో మంచి పేరు ఉన్నా ఎమ్మెల్యేకి కుటుంబ బంధాలే అడ్డంకిగా మారాయి. పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వైసీపీని వీడి టీడీపీలో ఏడాది క్రితం చేరిపోయారు. మరోమామ శత్రుచర్ల విజయరామరాజు కూడా టీడీపీలోనే ఉన్నారు. శత్రుచర్ల విజయరామరాజుకు ఈ నియోజకవర్గంలో మంచిపట్టుంది. గిరిజనుల్లో గుర్తింపు ఉంది. దీంతో కురుపాం టిక్కెట్ ను వచ్చే ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు భార్య శశికళ దేవికి టీడీపీ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక్కడ అత్తాకోడళ్ల మధ్య పోరు తప్పదు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్ధి కులం పై వివాదం నడుస్తుంది. తాజాగా దీనికి తోడు మరో కీలక నేత మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కూడా టీడీపీలో చేరడంతో వైసీపీకీ ఇక్కడ కష్టాలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి.

పుష్పశ్రీవాణి ప్రతిపక్షంలో ఉండటంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు,ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం లేదు తరుచూ జిల్లా సమస్యల పై జిల్లా సమావేశాల్లోనూ, అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తూ వార్తల్లోకి ఎక్కుతూ మంచిపేరే సంపాదించారు. ఈ నియోజకవర్గంలో త్రాగు, సాగునీరు ప్రధానమైన సమస్య. కొద్దిపాటి పొలాలు ఉన్న ఇక్క్డడ రైతులకు సాగునీరు లేక నానా అవస్థలు పడుతుంటారు. వేలాది ఎకరాలకు సరిపడ నీరు ఉన్న ఆ నీటిని రైతులకు అందించటంలో ఇప్పటివరకు ఉన్న ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం ఇక్కడ ప్రజలకు ఆగ్రహవేశాలకు గురిచేస్తుంది. ఇక్కడ దశాబ్ధాలుగా పెండింగ్ లో జంఝావతి, గుమ్మడిగెడ్డ, వట్టిగెడ్డ తో పాటు సుమారు ఇరవైకు పైగా మేజర్ చెక్ డ్యాంలు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. అంతేకాకుండా తోటపల్లి నిర్వాసిత గ్రామాలకు ఏళ్లు గడుస్తున్నపూర్తిస్థాయి పరిహరం అందకపోవడం ఇక్కడ అధికార టీడీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులేనని చెప్పవచ్చు.

ఎన్నికల తరువాత చోటుచేసుకున్న రాజకీయపరిణామాల నేపధ్యంలో కురుపాం నియోజకవర్గంలో మాజీమంత్రి టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం నుండి ఎమ్మెల్సీ అయినప్పటికీ ఇక్కడ రాజకీయాలు చక్కబెడుతూ కురుపాం నియోజకవర్గం పై దృష్టి సారించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. శత్రుచర్ల విజయరామరాజు, చంద్రశేఖర్ రాజులు ఇద్ద్దరు ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇవ్వడం వంటి అంశాలు కొత్త అభ్యర్ధి కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జీగా శత్రుచర్ల బార్య శశికళాదేవి ఉన్నా మరో కోత్త అబ్యర్దికోసం టిడిపి ప్రయత్నిస్తోంది. ఇక సీపీఎం నుండి మాజీ ఎమ్మెల్యే కోళక లక్షణ మూర్తి జనసేన పొత్తులో భరిలోకి దిగనున్నరు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు బరిలో దిగనున్నారు. కేంద్ర మంత్రి కిషోరే చంద్రదేవ్ టిడిపిలోకి రావడం ఆయనకి బలమైన కేడర్ ఉండటంతో ఈ సారి శ్రీవాణి గెలుపు అంత ఈజీ కాదన్నది నియోజకవర్గంలోని ప్రజల మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here