Home News

కుమార శకం ముగిసింది…!

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. సీఎం విజ్ఞప్తిమేరకు స్పీకర్ రమేష్ కుమార్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. సభకు 205 మంది హాజరుకాగా, మేజిక్ ఫిగర్ 103 అవసరమైంది. సర్కార్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు పోలవడంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. ముఖ్యమంత్రి స్పీకర్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటింగ్ ఫలితాల అనంతర సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.

దాదాపు 14 నెలలుగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. అధికార కూటమికి చెందిన 15మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న కర్ణాటక సంక్షోభం ముగిసింది. వాస్తవానికి ఈ నెల 18నే విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఐతే, సంకీర్ణ ప్రభుత్వం రెబల్ ఎమ్మెల్యేలని బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఇందుకోసం విశ్వాస పరీక్షని వివిధ కారణాల వలన వాయిదా వేస్తూ వస్తోంది. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు.

మరోవైపు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతుంది. విశ్వాసపరీక్షలో కుమారస్వామి బలం నిరూపించలేకపోవడంతో 14 నెలల జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ వాజూభాయ్ వాలాను కలవనున్నారు. తాజా పరిణామాలను వివరించేందుకు బీజేపీ ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here