Home Entertainment Now Showing

నితిన్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ బస్సు.. కేటీఆర్ గరంగరం..

ఈ రోజుల్లో పైరసీని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎవరెన్ని ప్లాన్స్ చేసినా కూడా పైరసీ మాత్రం పారుతూనే ఉంది. పొద్దున్నే విడుదలైతే సాయంత్రానికి ఆన్ లైన్ లో పైరసీ వచ్చేస్తుంది. దీనికి ఏ సినిమా కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా తెలంగాణ గవర్నమెంట్ బస్సులో భీష్మ సినిమాను ప్రదర్శించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏం చేయలేకపోతున్నారు. టిఎస్ఆర్టీసీ బస్సులో భీష్మ సినిమా పైరసీ ప్లే చేస్తుంటే ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దాన్ని దర్శకుడు వెంకీ కుడుములకు ట్యాగ్ చేసాడు. అప్పుడు ఆయన చూసి వెంటనే తన బాధను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెలియజేసాడు. ఆయన వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుంటానని హామీ ఇచ్చాడు.

కొన్ని గంటలలోనే ఈ వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఖమ్మం బస్సులో భీష్మ సినిమాను బస్సులో పైరసీ ప్లే చేసారు. ఇలాంటి వాళ్లను వదిలేయొద్దు సర్.. కచ్చితంగా ఏదో ఓ చర్య తీసుకోండి అంటూ దర్శకుడు వెంకీ కుడుముల తన ఆవేదన బయటపెట్టాడు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. మాకు ఏ సమస్య వచ్చినా మీరే గుర్తొస్తారని ట్వీట్ చేసాడు. ఓ వైపు తన టీం పైరసీ ఆపడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇలా బస్సుల్లో కూడా పైరసీ చేస్తుంటే ఎలా సర్ అంటూ ఆయన ప్రశ్నించాడు. మీరే దీన్ని అదుపు చేయాలంటూ కోరాడు వెంకీ కుడుముల.

మా సినిమా అనే కాదు ఏ సినిమాను పైరసీ చేయనివ్వకండి అంటూ ఆయన కోరుతున్నాడు. భీష్మ పైరసీ గురించి తనకు తెలిసేలా చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపాడు వెంకీ కుడుముల. ఇక మంత్రి స్పందిస్తూ వెంటనే దీనిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పాడు. సదరు బస్ డిపోపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని.. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపాడు. పైరసీని అంతమొందిచే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాన అని హామీ ఇచ్చాడు. మొత్తానికి భీష్మ బస్ పైరసీ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇదిలా ఉంటే భీష్మ సినిమా తొలివారంలోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here