నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేదం మందు ఇప్పుడు సంచలనంగా మారింది. కరోనా మహమ్మారి ధాటికి బలై ఎందరో విగత జీవులవుతున్న వేళ కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్నారు. నెల్లూరు కరోనా మందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో ఆసక్తిరేపుతుంది. అయితే ఈ మందు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కొలుకున్నట్లు తెలపడం సంచలనం రేపుతుంది.


కరోనా కాటుకు బలై కార్పోరేట్ ఆస్పత్రులలో లక్షలు తగలేసినా తగ్గని జబ్బు ముత్తుకూరులో సాధారణ సిద్ద వైద్యంతో తగ్గడం ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేదం మందు వైద్య వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. కృష్ణపట్నం ప్రాంతంలో ఎలా ఉందంటే 5వేల మందికి సరిపడా మందు మాత్రమే ఉందని నిర్వాహకులు చెబుతుంటే.. ఆశావాహులు మాత్రం సుమారు 35వేల మంది వరకు వచ్చారు. వీరిలో కరోనా రోగులే ఎక్కువ మంది ఉన్నారు.

కృష్ణపట్నానికి వెళ్లే మార్గంలో వందలాది అంబులెన్స్‌లు, వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వేలాదిగా కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులకు గురికావొద్దని, రెండు మూడు రోజుల తర్వాత వస్తే అందరికి మందు కచ్చితంగా ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పడానికి ఉన్న శాస్త్రీయత ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మందు వాడితే కరోనా పూర్తి నయమవుతుందని ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎలాంటి పరీక్షలు లేకుండా ఈ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్‌గ్రేడియంట్స్‌తో సామాన్యులు మందులు తయారు చేసుకొని వాడితే జరిగే నష్టానికి బాధ్యులు ఎవరు అవుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.