Home News

చంద్రబాబు పై రెబల్ స్టార్ ఫైర్ వెనుక స్కెచ్ ఇదేనా…!

పదవీకాంక్ష ఏ పనైనా… ఎంత పనైనా చేయిస్తుందంటే ఇదేనేమో… రాజకీయాల్లో ఉన్నారన్న మాటే కానీ…. ఇంతకాలం ప్రత్యర్ధిని ఒక్క మాట అనని వాళ్లు సైతం ఇప్పుడు గాండ్రిస్తున్నారు… సీనియర్ మోస్ట్ నేతల మీదే సెటైర్లు వేసేస్తున్నారు… మాట్లాడకపోతే వెనుకబడిపోతామన్న భయమో? మౌనంగా ఉంటే ఉనికి ఉండదనే భాదో ? కానీ కొంత మంది ఇప్పుడు తమ సహజ శైలికి భిన్నంగా రియాక్ట్‌ అవుతూ ఫోకస్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు..


రెబల్ స్టార్ కృష్ణంరాజు… బీజేపీలో చేరి అనూహ్యంగా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజు ప్రతిపక్షాలపై గాండ్రిస్తున్నారు… తన సహజశైలికి భిన్నంగా విమర్శలు గుప్పిస్తున్నారు… రాజకీయాల్లోకి వచ్చి ఇరవై ఏళ్లే అయినా… ఎంపిగా గెలిచింది ఒక్కసారే అయినా.. పొలిటికల్‌గా పండిపోయినట్లు .. రాజకీయంగా ఢక్కా ముక్కీలు తిన్న చంద్రబాబు మీదే ఆయన సెటైర్లు వేస్తున్నారు… అప్పట్లో టిడిపి మద్దతుతోనే గెలిచానన్న సంగతి మర్చిపోయి .. టీడీపీ పని అయిపోయిందని… చంద్రబాబు చచ్చిన పామంటూ … కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు … గతంలో కృష్ణంరాజు నోటి వెంట ఎప్పుడూ ఇలాంటి మాటలు రాలేదు… కేంద్ర మంత్రిగా ఉన్నా… ఆనాటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనలేదు ఈ రెబల్ స్టార్.

కటౌట్ భారీగా ఉన్నా మృదు స్వభావిగా ఇండస్ట్రీలో పేరుంది రెబల్‌స్టార్‌కి … రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆ పేరును పోగొట్టుకోలేదు కృష్ణంరాజు… కానీ ఇప్పుడు ఆయన వైఖరి డిఫరెంట్‌గా కనిపిస్తోంది… అందులోనూ బీజేపీకి బద్ద శత్రువులా మారిన టీడీపీని టార్గెట్ చేసుకుని ఘాటైన విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు… ఇక్కడే అందరికీ లేనిపోని డౌట్లు వస్తున్నాయి… ఇన్నేళ్లు అజాత శత్రువులా ఉన్న మనిషి ఇప్పుడెందుకు ఇలా మారారో అని అంతా తలబద్దలు కొట్టుకుంటున్నారు.

టీడీపీని విమర్శించడానికి కృష్ణంరాజుకు ఏ కారణాలు ఉన్నాయో ఏమో కానీ…. జనం మాత్రం పెద్ద పదవి కోసం వేసిన ప్లాన్‌లో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు… ఎన్డీయే మొదటి విడతలోనే కృష్ణంరాజును గవర్నర్ చేసేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది… ఆయన కూడా ఆ ప్రచారానికి ఉబ్బితబ్బిబ్బయ్యారు… అయితే ఆ పదవి దక్కలేదు … ఎన్డీయే రెండో విడత ఘన విజయం సాధించడంతో మరోసారి గవర్నర్ గిరిపై కృష్ణంరాజు ఆశలు పెంచుకున్నారట… అందుకే తన రాజకీయ వ్యూహం మార్చుకున్నారట.. ఇరవై ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నా… పెద్దగా యాక్టివ్ గా ఉండని కృష్ణంరాజు ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడంతోపాటు… పార్టీ కార్యక్రమాల్లోనూ ఠంచనుగా పాల్గొంటున్నారు.


అనారోగ్య కారణాల రీత్యా కొంత బ్రేక్ వచ్చింది ఆయనకి … అయితే తిరిగి పొలిటికల్‌గా యాక్టివ్ కాలేపోయారు .. ఏపీకి ఇప్పుడు హైకమాండ్ విపరీతమైన ప్రాధాన్యత ఇస్తుండటంతో పాత కాపైన కృష్ణం రాజు ఇప్పుడు మేల్కొన్నట్లు కనిపిస్తున్నారు … లాభమో నష్టమో ఇన్నాళ్లు ఉన్నాం… ఇప్పటికైనా ఓ పదవి ఇవ్వకపోతారా? అన్నభావనతో ఆరోగ్యం సహకరించకున్నా…. ప్రోయాక్టివ్ అవుతున్నారు … హైకమాండ్ దృష్టిలో పడటానికి పార్టీ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండటం ఒకటైతే…. రెండోది టీడీపీని తిట్టడం రెండోది… ఈ రెంటిని సమపాళ్లలో పండిస్తున్న ఈ రెబల్ స్టార్ … హిజ్ ఎక్స్‌లెన్సీ అని అనిపించుకుంటారో? లేదో? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here