Home News Updates

ఆ మంత్రితో పెట్టుకుంటే అంతేనా..టీడీపీలో ‘నాని’ ఫియర్

మంత్రి కొడాలి నాని మైక్‌ ముందుకు వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. ఒక్కో సమయంలో నాని విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు కుడా కరువవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని ఎప్పుడూ ఘాటు వ్యాఖ్యలే చేస్తుంటారు. మాజీ సీఎం పేరు ఎత్తితే చాలు.. కొడాలి కస్సుమంటారు. ఇక లోకేష్ గురించి అయితే చెప్పేదే లేదు. అయితే నాని వ్యాఖ్యలను టీడీపీ నాయకులు లైట్ తీసుకోవడంపై ఇప్పుడు సైకిల్ కేడర్ లో కొత్త చర్చ నడుస్తుంది.

కర్నూలు జిల్లాలో హత్యకుగురైన టీడీపీ నేతల కుటుంబాల పరామర్శకు వెళ్లిన లోకేష్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా లోకేష్‌ అనడం.. మంత్రి నాని రంగంలోకి దిగడం.. తనదైన స్టయిల్లో దుమ్ముదులిపేశారు. లోకేష్‌లాగే.. నానీ కూడా డోస్‌ పెంచేశారు. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ నుంచి మాత్రం మంత్రికి కౌంటర్ దొరకడం లేదు. మంత్రి వ్యాఖ్యలకు రియాక్ట్ అవ్వాల్సిన స్థాయిలో టీడీపీ నేతలు నోరెత్తడం లేదు. ముఖ్యంగా టీడీపీలో ఉండే సీనియర్ నేతలు, అదే సామాజికవర్గానికి చెందిన నాయకులు పూర్తిగా మౌనం దాల్చుతున్నారు.

మంత్రి కొడాలి ఏస్థాయి కామెంట్స్‌ చేసినా టీడీపీలో సీనియర్ నేతలు కిక్కిరుమనడం లేదు. అప్పుడప్పుడు దేవినేని ఉమా మాట్లాడినా అవి పెద్దగా జనంలోకి పోవడం లేదు. పార్టీలోను రాజకీయంగానూ ప్రాధాన్యమూ లభించడం లేదు. అసలు కొడాలికి కౌంటర్ ఇచ్చే నేతలే పార్టీలో దొరకడం లేదట. యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటివాళ్లు నానీ పై ప్రతివిమర్శలు చేయడానికి సీనియారిటీని సాకుగా చెబుతుంటారు. అందుకే వాళ్లు కొడాలిపై మాట్లాడలేరు. సీనియర్ల సంగతి అలా ఉంటే.. ఇతర మాజీ మంత్రులు, నాయకులు తమకెందుకులే అని సైలెంట్‌గా ఉంటున్నారు.

పక్క జిల్లాలో ఉన్న పుల్లారావు, యరపతినేని వంటి వారు అస్సలు పట్టించుకోవడం లేదు. మొదట్లో కొద్దిరోజులు మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆ ప్రయత్నం చేసినా ఇప్పుడు వదిలేశారు. నానికి కౌంటర్ అనగానే నేతలు భయపడుతున్నారు. నాని జోలికి వెళ్తే తమకు ఎక్కడ చాకిరేవు పడుతుందోనని ..లేదా మనదికాని విషయంలో వేలు పెట్టడం అవసరమా అని నోరెత్తడం లేదట. వైసీపీ నుంచి ఎవరు మాట్లాడినా టీడీపీ నుంచి రియాక్షన్ ఉంటుంది. కానీ, కొడాలి మాట్లాడితే మాత్రం కౌంటర్ ఉండదు. ఈ పరిణామం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తికి కారణం అవుతోంది. ఈ పరిణామాలపై పార్టీ కేడర్లో పెద్ద చర్చే జరుగుతోంది. కొడాలికి కౌంటర్‌ ఇచ్చేవాళ్లు టీడీపీలో లేరని నిట్టూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here