Home News Politics

ప్రైవేట్ కంపెనీల్లా ప్రాంతీయ పార్టీలు…సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి…!

దేశ ప్రజలు మోడీ తమ నాయకునిగా గుర్తించి బాధ్యతలు అప్పగించారు. దేశంలో మోడీకి సరితూగిన విపక్ష నేతలు ఎవరులేరు అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి . కాంగ్రెస్ ఇచ్చే వాగ్దానాలు ఒక్కటి కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జాతీయ పార్టీల పెత్తనం అవసరం లేదు అంటున్న ప్రాంతీయ పార్టీల నేతలు చేస్తున్నది ఏంటి అంటు టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ , కేటీఆర్ చెప్పేది అంత బూటకం అన్నారు…ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ కంపెనీలలాగా తయారు అయ్యాయి అన్నారు కిషన్ రెడ్డి…

జాతీయ పార్టీల పెత్తనం అవసరం లేదు అంటున్న ప్రాంతీయ పార్టీల నేతలు చేస్తుంది ఏంటి. వారు చేస్తున్నది కుటుంభ పాలన కదా అన్నారు. దేశంలోనే కాదు ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్న చోట కూడా మోడీనే మళ్ళీ రావాలని విశ్వసిస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వం హయంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అనవసర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బిజెపి వైపు ఒక వేలు చూపితే … అనేక వేళ్ళు కాంగ్రెస్ వైపు చూపిస్తాయి అన్నారు.

గతంలో అనేక సార్లు బాంబు దాడులు , సైనికుల పై కాల్పులు చూసాము. కానీ ప్రజల్లో వచ్చిన చైతన్యం కారణంగా మోడీ తీసుకున్న నిర్ణయం దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. పుల్వామా ఘటన తరువాత దేశ ప్రజల ఆకాంక్షను గౌరవించి శత్రు దేశానికి తగిన బుద్ధి చెప్పారు మోడీ. అంతర్జాతీయ స్థాయిలో మోడీ తీసుకున్న నిర్ణయాల ద్వారా పాకిస్థాన్ ను ఒంటరిని చేయగలిగాము. పుల్వామా ఘటన లో వింగ్ కమాండర్ ధైర్య సాహసాలను యావత్తు దేశము కొనియాడిందన్నారు కిషన్ రెడ్డి.

బీజేపీకి ఈసారి కర్ణాటక ,యూపీలో అత్యధిక సీట్లు రాబోతున్నాయి. టిఆర్ఎస్ కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని దుయ్యబట్టారు. 16 సీట్లు గెలిచి ఢిల్లీలో నువు చక్రం తిప్పేది ఏంది. ముందు కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో నుండి తీసుకోండి కేసీఆర్ గారు అక్కడ బాబు, ఇక్కడ కేసీఆర్ , పచ్ఛిమ బెంగల్ లో మమత బోగస్ ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను గాలికి వదిలేసిన టిఆర్ఎస్ అదే సెంటిమెంట్ తో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. టిఆర ఎస్ ఎంపీ సీట్లు ఎవరికి ఇచ్చారు. వారిలో ఒక్కరైనా ఉద్యమ కారుడు ఉన్నాడా అని సూటిగా ప్రశ్నించారు.

సీట్లు ఎవరికైనా ఇచ్చుకోండి.కానీ సెంటిమెంట్ గురించి మాట్లాడకండి. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం తో ఎలా చెట్ట పట్టాలు ఏసుకొని తిరుగుతావ్. పోయిన సారి అన్ని కలిపి 15 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఎం చక్రం తిప్పారు.ఇప్పుడు ఎం తిప్పుతారు. మళ్ళీ ఎవరూ ప్రధాని కావలనేది ప్రజలు నిర్ణయించబోతున్నారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పే …మళ్ళీ మోడీ ప్రభుత్వం రాబోతుంది అనిచెప్తుంది. కుటుంభ పార్టీలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా వారి డైనింగ్ టేబుల్లా మీద పరిపాలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కుటుంభ రాజకీయాలకు చరమగీతం పాడబోతున్నాం. కొందరు అయితే ఎప్పుడూ తండ్రి పక్కకు జరుగుతాడా నిను ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కలి అని ఎదురు చూస్తున్నారు అంటూ పరోక్షంగా కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here